ఏపీలో విచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. మీడియాను అడ్డం పెట్టుకుని పలు విధాలుగా జిమ్మిక్కులు చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా అరెస్టుల వరకు వెళ్లి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి. దీంతో కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపట్టకపోగా అనవసర విషయాలను ఫోకస్ చేస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.
టీడీపీ నేతలపై..
వైసీపీ నేతలు టీడీపీ నేతలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. వారిని కేసుల్లో ఇరికించి భయభ్రాంతులకు గురి చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రజా అవసరాలు గుర్తించక వారిని సైతం పక్కదారి పట్టించేందుకే పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే..
ప్రభుత్వంపై వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే ఏపీ సర్కారు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. ప్రజల దృష్టి మరల్చడానికి పక్కా ప్లాన్ చేస్తున్నారు. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ లను అరెస్టు చేసేంతగా హంగామా సృష్టిస్తూ రభస చేస్తున్నారు. దీంతో ప్రజల దృష్టి పక్కదారి పడుతుందని భావిస్తున్నారు.
నెగెటివ్ ప్రచారం కాకుండా..
ప్రభుత్వ విధానాలపై నెగెటివ్ రాకుండా ఉండేందుకు వైసీపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. టీపీపీ నేతల దూకుడుకు కళ్లెం వేస్తూ వారు నోరు మెదపకుండా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకతను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. టీడీపీ నేతలనే బాధ్యులను చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు ఏది ఏమైనా రాష్ర్టంలో వినూత్న పోకడలతో వింత ప్రవర్తనతో పార్టీలు వ్యవహరిస్తున్నాయనేది జగమెరిగిన సత్యం.