
రాష్ట్రంలో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం నుంచి కర్ణాటక ఉత్తర ప్రాంతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.