https://oktelugu.com/

ఎంత గొప్ప పనిచేశావ్?.. అసలు సిసలు లీడర్ అంటే నువ్వేనయ్య హరీష్ రావు

మంత్రి హరీష్ రావు.. తెలంగాణ ట్రబుల్ షూటర్.. ఆయన కాలుపెడితే ఎన్నికల్లో విజయమే.. ప్రజల్లో ఫుల్ ఫాలోయింగ్.. హరీష్ రావు అంటే పడిచచ్చే వారు ఎందరో ఉన్నారు. సిద్దిపేటలో హరీష్ రావును కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు. ప్రజలు దేవుడిగా ఆయన్ను కొలుస్తారు.. ఇంత క్రేజ్ హరీష్ రావుకు ఎక్కడిది.? ప్రజలు ఎందుకు హరీష్ రావు కోసం ఇంత పిచ్చిగా ఆరాధిస్తారనే దానికి తాజాగా సమాధానం దొరికింది.. Also Read: బీజేపీని నీడలా వాడుతున్న టీడీపీ..! : […]

Written By:
  • NARESH
  • , Updated On : January 21, 2021 / 02:09 PM IST
    Follow us on

    మంత్రి హరీష్ రావు.. తెలంగాణ ట్రబుల్ షూటర్.. ఆయన కాలుపెడితే ఎన్నికల్లో విజయమే.. ప్రజల్లో ఫుల్ ఫాలోయింగ్.. హరీష్ రావు అంటే పడిచచ్చే వారు ఎందరో ఉన్నారు. సిద్దిపేటలో హరీష్ రావును కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు. ప్రజలు దేవుడిగా ఆయన్ను కొలుస్తారు.. ఇంత క్రేజ్ హరీష్ రావుకు ఎక్కడిది.? ప్రజలు ఎందుకు హరీష్ రావు కోసం ఇంత పిచ్చిగా ఆరాధిస్తారనే దానికి తాజాగా సమాధానం దొరికింది..

    Also Read: బీజేపీని నీడలా వాడుతున్న టీడీపీ..! : నేతల హాట్‌ కామెంట్స్‌

    కరోనా లాక్ డౌన్ తర్వాత అందరూ ప్రజా రవాణా చేయడం లేదు. అంటే బస్సులు, ఆటోలు, రైళ్లలో ప్రయాణించడం లేదు. దీంతో ఆటోలు నడుపుకుంటున్న ఆటో డ్రైవర్లు అంతా అర్థాకలితో ఉంటూ లోన్లు కట్టలేకపోయారు. సిద్దిపేట జిల్లా ఆటోడ్రైవర్లు అంతా కలిసి తమను ఆదుకోవాలని తాజాగా మంత్రి హరీష్ రావును ఆశ్రయించారు.

    మంత్రి హరీష్ రావు సైతం వేగంగా స్పందించి వారికి ప్రభుత్వ పరంగా సాయం చేయాలని చూశారు. కానీ అలా సాధ్యం కాదని అధికారుల ద్వారా తెలుసుకున్నాడు.

    వెంటనే సిద్దిపేటలోని తన ఆస్తిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.45 లక్షల రుణం తీసుకొని తెలంగాణలోనే మొదటి ‘ఆటోడ్రైవర్ల సహకార పరపతి సంఘం’ను ఏర్పాటు చేసి వారికి లోన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్థిక భరోసాను కల్పించారు.

    Also Read: తిరుపతి విషయంలో ఏం చేస్తాడో..: జనసేన కార్యకర్తల్లో టెన్షన్‌

    రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు కూడబెట్టుకున్న వారు ఉన్న ఈ రోజుల్లో నిస్వార్థంగా సేవ కోసం ఆస్తిని తాకట్టు పెట్టిన మంత్రి హరీష్ రావు తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

    రాజకీయాల్లో సేవ చేయాలనుకునే గుణం చాలా మందికి ఉంటుంది. కానీ సంపాదించుకునే వారు కూడా ఉన్నారు. అయితే ప్రజల కోసం ఆస్తులు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి కొందరే వస్తుంటారు. ఆ కొందరిలో ఒక్కడే హరీష్ రావు. ఆయన చేసిన పనికి ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. 850మంది ఆటోడ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపిన హరీష్ ను కొనియాడకుండా ఉండలేకపోతున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్