కరోనా కంటే కఠిన సమస్య

ప్రపంచం మొత్తం కరోనా సమస్యతో విలవిలలాడిపోతూ ఉంటే సైబర్ నేరగాళ్లు మాత్రం ఇదే అవకాశంగా భావిస్తున్నారు ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీ కార్డు నెంబర్ చెప్పండి అని అడిగేవారు ఇప్పుడు కొంచెం పంథా మార్చుకుని వారి మార్గం సుగమం చేసుకున్నారు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయగానే మీరు చైనీస్ యాప్ వాడటం వల్ల మీ కార్డు వివరాలు బహిర్గతం కాబడ్డాయి అందుకే వెంటనే మీ కార్డు బ్లాక్ చేయాలి దీనిని బ్లాక్ […]

Written By: Neelambaram, Updated On : July 16, 2020 3:53 pm
Follow us on


ప్రపంచం మొత్తం కరోనా సమస్యతో విలవిలలాడిపోతూ ఉంటే సైబర్ నేరగాళ్లు మాత్రం ఇదే అవకాశంగా భావిస్తున్నారు ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీ కార్డు నెంబర్ చెప్పండి అని అడిగేవారు ఇప్పుడు కొంచెం పంథా మార్చుకుని వారి మార్గం సుగమం చేసుకున్నారు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయగానే మీరు చైనీస్ యాప్ వాడటం వల్ల మీ కార్డు వివరాలు బహిర్గతం కాబడ్డాయి అందుకే వెంటనే మీ కార్డు బ్లాక్ చేయాలి దీనిని బ్లాక్ చేసేందుకు మీ కార్డు వివరాలు తెలియజేయండి అని భయబ్రాంతులకు గురిచేస్తూ మాట్లాడుతున్నారు.

చైనీస్ యాప్ వలన ఇప్పటివరకు ఎలాంటి నష్టం లేకపోయినా సైబర్ నేరగాళ్లు మాత్రం ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటున్నారు. దీనిపై సైబర్ పోలీసింగ్ అవగాహన పెంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు, దీనికి పరిష్కార మార్గం ఒకటే మీరు మాస్క్ వేసుకోండి నోరు మూసుకోండి కార్డు వివరాలు ఎవరికీ తెలియజేయకండి బి సేఫ్ అని ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

ముద్రగడ.. కాపులు.. ఓ కుట్రకోణం!

ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతోందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు తెలియజేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ కు సంబంధించిన వివరాలు సైబరాబాద్ సెల్ కంప్లైంట్ 9490617444 నెంబర్ కి తెలియజేయాలని సమస్యను వ్యాప్తి చెందకుండా చూస్తామని అన్నారు.

భారతదేశం డిజిటల్ కరెన్సీ వైపుకు మారుతున్న తరుణంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కో సహజమే అయినా ఈ సమస్య త్వరగా పరిష్కార మార్గాన్ని కనుక్కోవటం ద్వారా పూర్తి డిజిటల్ కరెన్సీ విధానాన్ని అమలు చేయవచ్చు.