https://oktelugu.com/

బయోగ్రఫీ : ‘రష్మిక మందన్నా’ ప్రేమ సీక్రెట్స్ తో సహా !

వెండితెర పై అప్పుడే పూసిన అల్లరి పిల్లలా ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తుంది ‘రష్మిక మందన్నా‘. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న ఈ లవ్లీ బ్యూటీది సినీ లోకంలో పూల బాట ఏమీ కాదు, అలా అని కన్నీళ్లు చాటున ఎదిగిన గతమూ ఆమెకు లేదు. అసలు రష్మిక ఎప్పుడూ సినిమాల్లోకి రావాలని కలలు కనలేదు.. ఆరాటం అంతకన్నా పడలేదు. ఇప్పటికీ ‘నీలాంటి అమ్మాయి సినిమాల్లోనా’ అని రష్మీకను వాళ్ళ అమ్మ ఆటపట్టిస్తుంటుందట. నిజానికి ‘నేనేంటి? […]

Written By:
  • admin
  • , Updated On : July 14, 2020 / 11:23 AM IST
    Follow us on


    వెండితెర పై అప్పుడే పూసిన అల్లరి పిల్లలా ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తుంది ‘రష్మిక మందన్నా‘. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న ఈ లవ్లీ బ్యూటీది సినీ లోకంలో పూల బాట ఏమీ కాదు, అలా అని కన్నీళ్లు చాటున ఎదిగిన గతమూ ఆమెకు లేదు. అసలు రష్మిక ఎప్పుడూ సినిమాల్లోకి రావాలని కలలు కనలేదు.. ఆరాటం అంతకన్నా పడలేదు. ఇప్పటికీ ‘నీలాంటి అమ్మాయి సినిమాల్లోనా’ అని రష్మీకను వాళ్ళ అమ్మ ఆటపట్టిస్తుంటుందట. నిజానికి ‘నేనేంటి? సినిమాల్లో ఏంటి?’ అని రష్మికకే అప్పుడప్పుడు అనినిపిస్తోందట. ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ల ఇంట్లో సినిమా వాసనలు కానీ, ఆ వాతావరణం గాని ఏదీ లేదు. పైగా రష్మికకు మరీ అంత సినిమా పిచ్చి కూడా ఏమి లేదు. కానీ ఇప్పుడు సినిమాల్లో ఓ తారలా వెలిగిపోతుంది. ఇది ఎలా జరిగిందని ఈ బ్యూటీని కాస్త కదిలిస్తే… ఏమో అంతా ఓ మెరుపు కలలా, కలలో జరిగిన స్వప్నంలా అంతా జరిగిపోయిందని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చెబుతుంది.

    మరో భారీ ఆఫర్ కొట్టేసిన రష్మిక!

    రష్మికది కర్ణాటక కూర్గ్‌ దగ్గర్లోని విరజ్‌పెట్‌. వాళ్ళ నాన్నగారు బిజినెస్ మెన్. కాఫీ తోటల వ్యాపారంలో ఆయన దిట్ట. ఆ రకంగా గోల్డెన్ స్పూన్ లోనే అందమైన రష్మిక పాదాలు సుకుమారపు అడుగులు వేశాయి. చదువు విషయానికి వస్తే.. పది వరకూ కూర్గ్‌ లో.. అలాగే మైసూర్‌లో ఇంటర్‌, బెంగళూరులో డిగ్రీ చేసింది. అన్నట్టు అమ్మడు సైకాలజీతో పాటు జర్నలిజంలో కూడా డిగ్రీ చేసింది. ఇంటర్‌, డిగ్రీలలో రష్మిక టాపర్‌ కూడా. అందుకేనేమో చిన్నప్పుడు ఓసారి ‘డాక్టర్‌’ అవ్వాలని మారం చేసిందట. కానీ గుండె, మూత్ర పిండాల డ్రాయింగ్ పూర్తి చేసే సరికీ ఇదంతా తన వల్ల కాదని ఈ లేత బ్యూటీ ఫిక్సయిపోయింది. అయితే రష్మిక డిగ్రీలో ఉన్నప్పుడే ‘కిరిక్‌ పార్టీ’ అనే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది.

    అయితే అమ్మాయి ఎంత అందంగా ఉంటే మాత్రం.. సినిమా ఛాన్స్ లు ఈజీగా రావు కదా.. అలా అని రష్మిక ముంబై భామల్లా ఎన్నో ఆటుపోట్లుకు నలిగిపోలేదు. డిగ్రీలో ఉన్నప్పుడు మోడల్‌గా ట్రై చేసింది రష్మిక.. అదీ ఆమె క్లోజ్ ఫ్రెండ్ సలహాతో. అలా ‘ఫ్రెష్‌ ఫేస్‌ ఆఫ్‌ ఇండియా 2014’ టైటిల్‌ ను గెలుచుకుని తన అందచందాలను నేటి సమాజానికి ఘనమైన ఘాటు ఫోటోషూట్ లతో చాటి చెప్పింది. అలా నన్ను సినిమాల్లోకి లాక్కొచ్చింది ఆ టైటిల్, అప్పుడు నేను అందంగా దిగిన ఫొటోలే అంటూ తన గతాన్ని సింపుల్ గా చెప్పేస్తోంది ఈ హస్కీ పాప.

    చైతూ సరసన రష్మిక?

    మొత్తానికి ‘కిరిక్‌ పార్టీ’ సూపర్ హిట్ తో ‘ఛలో’ అంటూ తెలుగులోకి వచ్చి వాలింది. ఛలో కూడా హిట్ అవ్వడం, వెంటనే ‘గీత గోవిందం’ పడటం దాంతో ఈ బ్యూటీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అలా మహేష్ తో ఆడిపాడి ప్రస్తుతం బన్నీతో రొమాన్స్ కి రెడీ అవుతోంది. మధ్యలో అప్పుడప్పుడు త్రివిక్రమ్ ను కూడా కాకపడుతుందట. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ ఇవ్వమని.. ఒకవేళ గురూజీకి పాప అడిగిన విధానం నచ్చితే గనుక, ఎన్టీఆర్ సినిమాలో కూడా రష్మిక అందాల విందు ఉండే అవకాశం ఉంది. ఇకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ అంటే ఈ బ్యూటీనే అనే పరిస్థితి వచ్చేస్తోందేమో.

    అన్నటు ఈ పాపకి కొన్ని ఇష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రష్మికకు స్విమ్మింగ్‌ అంటే చాలా ఇష్టమట. అలాగే త్రోబాల్‌ లో కాలేజీ ఛాంపియన్‌ కూడా. ఇక భరతనాట్యం, ఫోక్‌ డ్యాన్స్‌ అంటే పిచ్చి అట. స్కూల్లో, కాలేజీలో డాన్స్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇరగదీసేదట. ఇప్పుడు సినిమాల్లో కూడా అలాగే రెచ్చి పోతుంది అనుకోండి. ఇక రష్మిక బెస్ట్‌ ఫ్రెండ్స్‌ పేర్లు.. అన్మోల్‌, ప్రేరణ, ఆపేక్ష,. వీరంతా చిన్నప్పటి నుండే స్నేహితులు. అయితే ఈ బ్యూటీలో పెద్ద అమాయకత్వం కూడా ఉందండోయ్. చిన్నప్పుడు వాళ్ళ నాన్న జేబులో నుండి పది, ఇరవై రూపాయల నోట్లు తీసేసి అందరికీ పంచిపెట్టేదట. ఎందుకంటే దానం చేస్తే పుణ్యం వస్తుందని ఎవరో చెప్పారట. ఇంకా నయం వాళ్ళు దానం అని చెప్పారు, లేకపోతే ఇంకేమీ పంచడానికి సిద్దపడేదో పాపం.

    ఇక చివరగా రష్మిక ప్రేమ కహానీల గురించి ముచ్చటించుకుంటే.. పదిహేను ఏళ్లకే కుర్రాళ్లు రష్మిక చుట్టూ ప్రదక్షిణలు చేసేవారట. ఆ వయసులోనే ఆమెను ఒక కుర్రాడు ఇంప్రెస్ చేశాడట. కానీ అన్ని టీనేజీ లవ్ స్టోరీలు లాగానే అది కూడా అర్ధవంతం లేకుండానే అర్ధాంతరంగానే ముగిసిపోయింది. ఆ తరువాత పాపకి కొన్ని చిలిపి ప్రేమలు ఉన్నా.. ‘కిరిక్‌ పార్టీ’ హీరో రక్షిత్‌ శెట్టితో మాత్రం ఘాటు ప్రేమనే సాగించింది. అయితే ఈ విషయాన్నీ ముందు వాళ్ళ అమ్మతోనే చెప్పిందట. పాపం కూతురు విరహ ప్రేమను చూసిన ఆ మహాతల్లి… ‘నీ ఇష్టం.. నీకేది అనిపిస్తే అది చెయమ్మా’ అంటూ కూతురు ఇష్టానికి విలువ ఇచ్చిందట. కానీ ఏం చేస్తాం.. రక్షిత్‌ శెట్టి సినిమాల్లోనే హీరో అయ్యాడు.. పాప జీవితంలో పాపం జీరోగా మిగిలిపోయాడు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది.