
జగన్ ని అధికారం పీఠం ఎక్కించిన ప్రధాన అంశాలలో నవరత్నాలు ఒకటి. జగన్ తన మేనిఫెస్టో లో పొందుపరచిన 9 అంశాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. ప్రజా సంకల్ప యాత్రలో స్థానిక సమస్యలను మరియు వాటికి పరిష్కార మార్గాల గురించి చెప్పిన జగన్, ప్రతి మీటింగ్ లో నవరత్నాలలోని ప్రతి ఒక పథకాన్ని క్షుణంగా వివరించారు. అన్ని సామాజిక, మరియు బడుగు బలహీన వర్గాలకు మేలు కలిగేలా రూపొందించిన నవరత్నలోని అంశాలు ప్రజల్ని బాగా ఆకర్షించాయి. మద్యపాన నిషేధం, పీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్లు, వైయస్సార్ ఆసరా, జలయజ్ఞం, రైతు భరోసా, అమ్మవడి వంటి విప్లవాత్మక పథకాలతో రూపొందించిన నవరత్నాల అమలు ఇప్పటికే పూర్తి చేశారు జగన్.
ఆనంతో… రఘురామ్, ఏం జరుగుతుంది జగన్ ?
టీడీపీ ప్రభుత్వంలో విద్యాసంస్థలకు బాకీ ఉన్న రీఎంబర్స్‌మెంట్ బకాయిలు జగన్ ప్రభుత్వం చెల్లింది. అమ్మవడి పథకం ద్వారా అర్హులైన తల్లిదండ్రుల ఖాతాలో వారి పిల్లల చదువుకోసం రూ. 15వేలు జమ చేయడం జరిగింది. ఇక మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్, మద్యం అమ్మకాలు సగానికి పైగా తగ్గించారు. రైతు భరోసా, వైయస్సార్ చేయూత పథకం క్రింద అర్హులైన రైతులు ఇతర వృత్తుల వారు లబ్ది పొందారు. ఆగస్టు నుండి పింఛన్ల పెంపుకు కూడా శ్రీకారం చుట్టారు. రూ. 2250గా ఉన్న పెన్షన్ ని రూ. 2500 చేస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా కేంద్రం సహాయంతో పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికలకు ముందు చేసిన అన్ని వాగ్దాలను సచివాలయం గోడలపై అంటించి, తన చిత్తశుద్ధి చాటుకున్నారు.
ఇప్పుడు ఆ కాపునేతలు ఏం సమాధానం చెబుతారు..?
ఐతే వచ్చే ఎన్నికలలో జగన్ కి నవరత్నాల అమలే ప్రధాన అజండా కానుంది. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చిన జగన్ ధైర్యంగా ప్రజలను ఓటు అడుగగలడు. ఈనేపథ్యంలో చంద్రబాబు ఎన్నికల అజెండా, మ్యానిఫెస్టో ఏమవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నవరత్నాలు అనేది పూర్తిగా అవినీతి మయం అని ప్రచారం చేసే సూచనలు కలవు. బాబు విమర్శించినా సదరు పథకాల వలన నేరుగా అర్హుల ఖాతాలలోకి డబ్బులు చేరుతున్న క్రమంలో అవినీతికి తావెక్కడ ఉంటుంది. ప్రతి పథకం ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులు బాబు ఆరోపణలు నమ్ముతారా అంటే కష్టమే. ప్రజలకు మేలు చేస్తున్న జగన్ నవరత్నాలను విమర్శించినా, రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం బాబుకు ఉండకపోవచ్చు. మరి వాటినే అమలు చేస్తాను అంటే…ఈయనకు ప్రత్యేకత ఉండదు . కాబట్టి దీనిపై ఇప్పటి నుండే ప్రత్యేక కసరత్తు బాబు మొదలుపెట్టాడట. నవరత్నాలకు మించిన ప్రజాకర్షక పథకాల అన్వేషణలో ఆయన ఉన్నారట. మరి రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉన్న బాబు ఎంత గొప్ప మ్యానిఫెస్టో తయారు చేస్తారో చూడాలి.