https://oktelugu.com/

Covert Leader: ఏపీలో ఓ పార్టీ..ఢిల్లీలో మరో పార్టీ.. వైసీపీ, టీడీపీల్లో కోవర్ట్ నేత!?

Covert Leader : రాజకీయాల్లో కొనసాగే ఏ నాయకుడైన ఒక పార్టీలోనే కొనసాగుతారు.. ఒక్కసారి ఆ పార్టీలో జాయిన్ అయిన తరువాత ఆ పార్టీ చేసే కార్యక్రమాల్లో పాల్గొంటాడు..కానీ ఇటీవల కొందరు నాయకులు రెండు పడవల మీద ప్రయాణిస్తున్నారు. అవసరానికో పార్టీ అన్నట్లు పైకి ఓ పార్టీలో ఉన్నట్లు కనిపిస్తున్నా.. మరో పార్టీ తరుపున వత్తాసు పలుకుతున్నారు. ఏపీకి చెందిన ఓ నాయకుడు తీరు అలాగే ఉంది. ఢిల్లీలో ఒక పార్టీ..రాష్ట్రంలో మరో పార్టీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 11, 2022 / 07:41 PM IST
    Follow us on

    Covert Leader : రాజకీయాల్లో కొనసాగే ఏ నాయకుడైన ఒక పార్టీలోనే కొనసాగుతారు.. ఒక్కసారి ఆ పార్టీలో జాయిన్ అయిన తరువాత ఆ పార్టీ చేసే కార్యక్రమాల్లో పాల్గొంటాడు..కానీ ఇటీవల కొందరు నాయకులు రెండు పడవల మీద ప్రయాణిస్తున్నారు. అవసరానికో పార్టీ అన్నట్లు పైకి ఓ పార్టీలో ఉన్నట్లు కనిపిస్తున్నా.. మరో పార్టీ తరుపున వత్తాసు పలుకుతున్నారు. ఏపీకి చెందిన ఓ నాయకుడు తీరు అలాగే ఉంది. ఢిల్లీలో ఒక పార్టీ..రాష్ట్రంలో మరో పార్టీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల్లో ఈ గుట్టు రట్టయింది. తాను పనిచేసే పార్టీ కోసం కాకుండా ఇతర పార్టీ కోసం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండడం పలు చర్చలకు దారి తీస్తోంది.

    TDP BJP alliance

    ఏపీలో వైసీపీ, టీడీపీలు బద్దశత్రువులు అని అందరికీ తెలుసు. టీడీపీలోని చాలా మంది వైసీపీలోకి మారారు. మరికొందరు బీజేపీలోకి మారారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఓ నేత ఢిల్లీ వేదికగా చక్రం తిప్పుతున్నాడు. ఏపీలోని కొన్ని వ్యవహారాల్లో అనవసరంగా వేలు పెడుతూ వివాదాలకు దారి తీస్తున్నాడు. రాష్ట్రపతి ఎన్నికల సందర్బంగా తాము వైసీపీ మద్దతు కోరలేదని ఆ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. మద్దతు ఇవ్వాలని అడగితే వైసీపీ నాయకులు వారంత వారే వచ్చారా..? అని అంటున్నారు.

    రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము నామినేషన్ వేసిన సందర్భంగా వైసీపీ నేతలు అందులో కనిపించారు. దీంతో బీజేపీ రమ్మంటేనే వారు వెళ్లారని  వైసీపీ నాయకులు బహిరంగంగా చెప్పకపోయినా.. అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ జాతీయ పార్టీ నాయకుడు మాత్రం తమకు, వైసీపీకి ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా అన్నాడు. దీంతో ఆ నాయకుడు  ఢిల్లీలో ఒకలాగా.. రాష్ట్రంలో మరోలా ఉంటున్నాడని కొందరు అంటున్నారు. ఢిల్లీలో బీజేపీ నేతగా వ్యవహరించినా.. రాష్ట్రానికొచ్చేసరికి ఆయన ఏ పార్టీ తరుపున వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు.

    బీజేపీ, వైసీపీలు అధికారికంగా కాకపోయినా కొన్ని విషయాల్లో కేంద్రానికి వైసీపీ మద్దతు ఇస్తోంది. కారణాలు ఏవైనా కొన్ని తప్పక నిర్ణయాలు తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ నేత మాత్రం తమది జాతీయ పార్టీ అని..ఏపీలో అధికారంలో ఉన్న పార్టీతో సంబంధాలు లేవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఏపీలో వైసీపీకి బద్ధ శత్రువైన టీడీపీకి సపోర్టుగా వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంతకు ఏ పార్టీ నాయకుడు..? అని కొందరు చర్చించుకుంటున్నారు.