Reason Behind Vijayendra Prasad Rajya Sabha Seat: మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మనకి గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు మెగాస్టార్ చిరంజీవి..ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన..రాజకీయంగా కూడా ఆయన ప్రస్థానం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..ప్రజారాజ్యం పార్టీ ని పెట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా 75 లక్షల ఓట్లు..మరియు 18 MLA స్థానాలను దక్కించుకున్నాడు..ఆ తర్వాత కొన్ని తీవ్రమైన ఒత్తిడుల కారణం గా ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో కలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..దీని వల్ల ఆయన అభిమానుల నుండి తీవ్రమైన వ్యతిరేకతని ఎదురుకున్నాడు..ఇక కాంగ్రెస్ పార్టీ తో కలిసిన తర్వాత ఆయనకీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గా పని చేసే అవకాశం దక్కింది..కేంద్ర మంత్రిగా ఆయన ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నడిపాడు..ఇక ఆంధ్ర ప్రదేశ్ రెండుగా చీలిపోవడం తో కాంగ్రెస్ పార్టీ ఏపీ లో కనుమరుగు అయ్యింది..ఇక చిరంజీవి కూడా పార్టీ కి అధికారిక రాజీనామా చెయ్యకపోయినా కూడా ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ నెమ్మదిగా రాజకీయాల నుండి తప్పుకున్నాడు..ఇక ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయ్యాడు.
ఇది ఇలా ఉండగా ఇటీవలే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కోటాలో ఉన్న నాలుగు రాజ్య సభ సీట్స్ ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే..అందులో బాహుబలి మరియు #RRR సినిమాల రచయితా విజయేంద్ర ప్రసాద్ (రాజమౌళి తండ్రి) గారికి కూడా రాజ్య సభ సీటు లభించింది..వాస్తవానికి ఈ సీటు ని ముందుగా మెగాస్టార్ చిరంజీవి కి ఇవ్వాలని అనుకున్నారట..బీజేపీ మినిస్టర్ కిషన్ రెడ్డి కూడా ఈ విషయం పై చిరంజీవి తో సంప్రదింపులు కూడా జరిపాడట..కానీ ప్రస్తుతం నేను సినిమాలతో బిజీ గా ఉన్నానని ..రాజకీయాలకు సంబంధించిన ఏ విషయంలో కూడా తల దూర్చాలనుకోవడం లేదని బీజేపీ ఇచ్చిన ఆఫర్ ని చాలా సున్నితంగా తిరస్కరించాడట చిరంజీవి..దీనితో చిరంజీవి కి ఇవ్వాల్సిన రాజ్య సభ సీటు ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.