ప్రారంభమైన కౌంటింగ్.. మొదటి ఫలితం ఇక్కడి నుంచే..!

జీహెచ్ఎంసీ పరిధిలో డిసెంబర్ 1న 149 డివిజన్లకు.. డిసెంబర్ 3న ఓల్డ్ మలక్ పేట డివిజన్ కు పోలింగ్ జరిగింది. నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువరించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఆ తర్వాత బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. Also Read: గ్రేటర్ లో ‘టీఆర్ఎస్’ కే పట్టం.. ఎందుకు? గ్రేటర్లోని 30సర్కిల్స్ పరిధిలోని కౌంటింగ్ […]

Written By: Neelambaram, Updated On : December 4, 2020 2:36 pm
Follow us on

జీహెచ్ఎంసీ పరిధిలో డిసెంబర్ 1న 149 డివిజన్లకు.. డిసెంబర్ 3న ఓల్డ్ మలక్ పేట డివిజన్ కు పోలింగ్ జరిగింది. నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువరించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఆ తర్వాత బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపు జరుగనుంది.

Also Read: గ్రేటర్ లో ‘టీఆర్ఎస్’ కే పట్టం.. ఎందుకు?

గ్రేటర్లోని 30సర్కిల్స్ పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు 200మీటర్ల దూరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ కేంద్రాల్లోకి ఎన్నికల అధికారుల గుర్తింపు కార్డు కలిగిన ఏజెంట్లు.. అధికారులు, సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాలున్న ఏరియా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతోన్నాయి.

నేటి ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో రౌండ్ కు 14వేల ఓట్లు లెక్కింపు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో రౌండ్ ఫలితం వెలువడేందుకు సుమారు గంట నుంచి గంటన్నర సమయం పట్టనుందని సమాచారం. దీంతో తక్కువ రౌండ్లు ఉన్న డివిజన్ ఫలితాలు ముందుగా వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఈ లెక్కన పోలింగ్ అయిన ఓట్లను పరిశీలిస్తే ముందుగా మెహదీపట్నం డివివిజన్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అతితక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. దీంతో ముందుగా మోహదీపట్నం ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఉదయం 10గంటల వరకు తొలి ఫలితం వచ్చే అవకాశం కన్పిస్తుంది. ఇక చివరగా మైలార్ దేవ్ పల్లి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి నేడు జీహెచ్ఎంసీ ఫలితాలు వెల్లడి కానుండటంతో గ్రేటర్ పీఠం ఈ పార్టీకి దక్కుతుందోననే ఆసక్తి నెలకొంది.