‘రైతుబంధు’పై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతుబంధును ఎగ్గొట్టొద్దని.. అవసరమైతే మరింత పెంచుతామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం సిరిసిల్ల జిల్లాలోని బందన్‌కల్ గ్రామంలోని ఊర చెరువులోకి ప్రవేశించిన గోదావరి జలాలకు హారతి ఇచ్చే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను కేటీఆర్ ఈ సందర్భంగా తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, 24గంటల […]

Written By: Neelambaram, Updated On : June 10, 2020 6:53 pm
Follow us on


తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతుబంధును ఎగ్గొట్టొద్దని.. అవసరమైతే మరింత పెంచుతామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం సిరిసిల్ల జిల్లాలోని బందన్‌కల్ గ్రామంలోని ఊర చెరువులోకి ప్రవేశించిన గోదావరి జలాలకు హారతి ఇచ్చే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను కేటీఆర్ ఈ సందర్భంగా తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంట్, సాగునీటి ప్రాజెక్టులు వంటివి చేపట్టారన్నారు. కొన్నిరోజులుగా ప్రతిపక్షాలు టీఆర్ఎస్ రైతుబంధు పథకాన్ని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చే రైతుబంధును ఎగొట్టడటం లేదని కొత్తవాళ్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రైతులను పట్టించుకోలేదన్నారు. గతంలో రైతులను రాబందులా పీక్కుతిన్నవారు నేడు రైతు బంధు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం నియంత్రిత సాగును అమలు చేసేది రైతుల బాగుకోసమేనని చెప్పారు. డిమాండ్ ఉన్న పంటలను తెలంగాణలో పండిస్తే మార్కెట్లో అధిక ధర లభిస్తుందని తెలిపారు. డిమాండ్ లేని పంటల వేయడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. రైతులు కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలకు మోసపోవద్దని సూచించారు.

ఉమ్మడి రాష్ట్రంలో 60ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు చేసిందేమీలేదన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలోనే రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తుంటారని తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి చెరువులు నిండి.. పొలాలు పచ్చబడుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు.

సిరిసిల్లలో 666 చెరువులు ఉన్నాయని తెలిపారు. వీటిలో ఎక్కువశాతం చెరువులను గోదావరి జలాలతో నింపుతామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో హరిత, నీలి, క్షీర విప్లవాలు రాబోతున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.