Homeఆంధ్రప్రదేశ్‌కాదు ఏ కులం జగన్ కు అనర్హం..

కాదు ఏ కులం జగన్ కు అనర్హం..

AP
ఏపీలో కులాల ఆధిపత్యం కొనసాగుతోంద. ఏ పని చేయాలన్నా కుల ప్రాతిపదికనే కొనసాగిస్తున్నారు. ఎవరికైనా కులమే బలంగా కనిపిస్తోంది. అందుకే ఏపీలో రెడ్డి, కమ్మ, క్షత్రియ ఇలా అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు ేసి వారి ఓట్లు దండు కోవడానికి పాచికలు వేస్తున్నారు. కార్పొరేషన్లతో వారికి ఒరిగేదేమీ లేకున్నా పదవుల ఆశ చూపి పబ్బం గడుపుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఇదే ట్రెండ్ రన్నింగ్ లో ఉంది. రాకీయ ప్రాపకం కోసం ప్రజలను పావులుగా చేసుకుంటున్నారు. వారితోనే అన్ని పనులు చేయించుకుంటూ వారికి తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇదేదో బాగుందని నాయకులు సందట్టో సడే మియా లాగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఫలానా వారికి ఇది ఇస్తున్నామని అది ఇస్తున్నామని చెప్పి ప్రలోభ పెడుతున్నారు.

రాష్ర్టంలో రెడ్డి కులం వారికి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. వారి జీవన విధానంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం చేసి జీవించే రెడ్డు పరిస్థితులు కలిసి రాక అనేక నష్టాలు అనుభవిస్తున్నారని తెలిపారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందుకోసం నిధులు కేటాయించి వారిలో ఆత్మస్థైర్యం నింపడమే ప్రధాన ధ్యేయంగా పేర్కొన్నారు. అడపాదడపా వచ్చే పంటలతో వారికి ప్రయోజనం కలగడం లేదని వాపోయారు. అందుకే రెడ్డి సామాజిక వర్గాన్ని

కమ్మ సామాజిక వర్గం కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా చేసుకున్న కమ్మలు సైతం జీవన గమనంలో కష్టాలతోనే సహవాసం చేస్తున్నారు. అందుకే వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో వారిలోని ఆర్థక అసమానతలు తొలగించేందుకు ప్రధాన భూమిక పోషించాలని భావిస్తోంది. కమ్మల్లో ఆర్థిక పరిపుష్టి సాధించి వారిలో ధైర్యం నింపడమే ప్రధాన కర్తవ్యం. అందుకే కమ్మ సామాజిక వర్గానికి స్వతంత్ర ఆర్థిక ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాుటు చేసింది.

క్షత్రియ సామాజిక వర్గం కోసం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. క్షత్రియులు తమ పిల్లల ఉన్నత విద్య కోసం చాలా కష్టపడుతున్నారని గుర్తించింది. వారిలో ఉన్న ఆర్థిక అసమానతలను రూపుమాపే క్రమంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ ఉండాలని భావించింది. అందుకే క్షత్రియ సామాజిక వర్గ ప్రయోజనాలే లక్ష్యంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీంతో వీరిలో ఉన్న కష్టాలు, నష్టాలకు చక్ పెట్టేందుకు ప్రధాన భూమిక పోషించేందుకు ఉద్దేశించినట్తు తెలుస్తోంది.

పదవులే లక్ష్యంగా..
రెడ్డి, కమ్మ, క్షత్రియ సామాజిక వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం పదవులు మాత్రం ఇస్తోంది. దీంతో చైర్మన్, డైరెక్టర్ల పదవుల కోసం అధికార పార్టీ నేతలు ప్రదక్షిణలు చే్స్తున్నారు. ఇదే అదనుగా తమ వారి కోసం పలు ప్రత్యేక ఆకర్షణ పథకాలు ఇస్తున్నట్లు పదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఏమీ కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం సామాజిక వర్గాలతో దోబూచులాడుతోందని తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Oktelugu Epaper
Exit mobile version