
రాష్ట్రంలో కొవిడ్ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరోమారు లాక్ డౌన్ పొడిగించింది. వచ్చే 7వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియారప్ప వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం కేజినేట్ మంత్రులు, సీనియర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మే 24 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉండగా నిపుణుల సూచనల మేరకు పొడిగించినట్లు సీఎం మీడియాకు వెల్లడించారు.