Also Read: బుద్ది తక్కువై పవన్ ను నమ్మాం.. పవన్ మూడు పెళ్లిళ్ల మాసికం: నారాయణ
ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం విద్యను ప్రదేశపెట్టిన జగన్.. రానురాను ఏపీలో కార్పొరేట్ స్కూళ్లకు భవిష్యత్ లేకుండా చేయాలనే టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి అమ్మఒడి పథకంతో ప్రభుత్వ స్కూళ్ల వైపు పిల్లల్ని ఆకర్షించాలనేది, తల్లిదండ్రులను ఆకట్టుకోవాలనేది ఏపీ ప్రభుత్వ ప్రణాళిక. గతేడాది అది దాదాపుగా నెరవేరింది. 2.50 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వదిలి ప్రభుత్వ పాఠశాల్లలో అడ్మిషన్లు పొందారు. డబ్బులు ఆశచూపి పిల్లల్ని ఇటువైపు తిప్పుకోవడం జగన్‌కు కాస్త ఇబ్బందిగా అనిపించిందట. అందుకే ప్రైవేట్ స్కూల్స్ కి కూడా అమ్మఒడి వర్తింపజేశారు. పిల్లల్ని స్కూల్‌కు పంపే ప్రతీ తల్లికి ఆర్థిక సాయం అందించారు. ఇక ఈ ఏడాది ప్లాన్ పూర్తిగా మారిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో విద్యారంగానికి ఏపీ ప్రభుత్వం 22,604 కోట్లు కేటాయించింది. అంటే ప్రభుత్వ విద్యకు జగన్ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
బడ్జెట్ నుంచి ఇప్పటికే రూ.3 వేల కోట్లతో నాడు–నేడు పనులు ప్రారంభమయ్యాయి. కరోనా సెలవులు కూడా కలిసి రావడంతో గ్రామాల్లోని ప్రతీ స్కూల్‌కు కొత్త రూపు తీసుకొచ్చారు. ఫర్నిచర్, మంచినీటి వసతి, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు.. ఇలా అన్నింటినీ సమకూరుస్తూ ప్రభుత్వ స్కూల్ తరగతి గదులకు కార్పొరేట్ లుక్ తీసుకొచ్చారు.
జగనన్న విద్యాదీవెనతో యూనిఫామ్, బ్యాగ్, షూస్, పుస్తకాలు.. ఉచితంగా అందిస్తున్నారు. గోరుముద్ద పథకం ద్వారా నాణ్యమైన భోజనాన్ని పెడుతున్నారు. అంగన్‌వాడీలను పూర్తిగా నర్సరీ స్కూల్స్ గా మారుస్తున్నారు. అమ్మఒడి ఎలాగూ ఉంది. క్రమక్రమంగా అమ్మఒడిని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపజేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి భారీగా ప్రభుత్వ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్నారు పిల్లలు. అన్నిటికంటే మించి ఇంగ్లిష్ మీడియం ప్రతిపాదన బ్రహ్మాస్త్రంలా పనిచేసింది.
కేంద్రం కొత్త సంస్కరణలు చేసినా, కోర్టులు కొర్రీలు వేస్తున్నా.. తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియంలోనూ బోధించడానికే జగన్ సర్కారు మొగ్గు చూపుతోంది. వీటన్నిటినీ బేరీజు వేసుకుని తల్లిదండ్రులు సర్కార్ స్కూళ్ల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు లక్షకు పైగా కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయంటే ఏ స్థాయిలో సక్సెస్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
Also Read: కేంద్రం బిల్లులపై బాబు ఎందుకు స్పందించట్లేదు..?
ప్రభుత్వ సెక్టార్‌లో 9, 10, ఇంటర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. కరోనా భయంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఇంకా స్కూల్స్ తెరవలేదు. ఈ క్రమంలో గతేడాది కంటే మూడు రెట్లు ఎక్కువగా ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతాయని అధికారుల అంచనా. అదే జరిగితే ఏపీలో విద్యా వ్యవస్థలో కార్పొరేట్ సెక్టార్ మనుగడ కష్టమనే చెప్పొచ్చు. ఫీజుల్లేవు, యూనిఫామ్, బుక్స్, భోజనం అన్నీ ఫ్రీగా అందుతుంటే ప్రజలు కార్పొరేట్ వైపు ఎందుకు చూస్తారు..? ఫీజుల నియంత్రణ లేకుండా, అనుమతుల విషయంలో అక్రమాలకు పాల్పడుతూ, ర్యాంకుల కోసం పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న కార్పొరేట్ యాజమాన్యాలపై అదను చూసి గట్టి దెబ్బ కొట్టారు జగన్.