https://oktelugu.com/

దుబ్బాకలో పార్టీల దూకుడు.. బరిలో వీరే?

దుబ్బాక ఉప ఎన్నికకు ఎట్టకేలకు షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో పార్టీలు ఉప పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొందరు అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకెళ్తుండగా.. ఇంకొన్ని పార్టీలు కత్తులు నూరుతున్నాయి. ఈ పోరు ఈసారి రసవత్తరంగానే కనిపిస్తోంది. సిట్టింగ్‌ స్థానాన్ని మళ్లీ తమ ఖాతాలోనే వేసుకోవాలని టీఆర్‌‌ఎస్‌ ఉవ్విల్లూరుతుండగా.. సింపతితో ఈసారి ఎలాగైనా ఈ సీటును కైవసం చేసుకోవాలని బీజేపీ తాపత్రయపడుతోంది. ఇక.. కాంగ్రెస్‌ తన వ్యూహం తాను రచిస్తోంది. వీరికితోడు కొందరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులూ ఈ స్థానం మీద […]

Written By: NARESH, Updated On : September 30, 2020 1:29 pm

dubbaka

Follow us on


దుబ్బాక ఉప ఎన్నికకు ఎట్టకేలకు షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో పార్టీలు ఉప పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొందరు అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకెళ్తుండగా.. ఇంకొన్ని పార్టీలు కత్తులు నూరుతున్నాయి. ఈ పోరు ఈసారి రసవత్తరంగానే కనిపిస్తోంది. సిట్టింగ్‌ స్థానాన్ని మళ్లీ తమ ఖాతాలోనే వేసుకోవాలని టీఆర్‌‌ఎస్‌ ఉవ్విల్లూరుతుండగా.. సింపతితో ఈసారి ఎలాగైనా ఈ సీటును కైవసం చేసుకోవాలని బీజేపీ తాపత్రయపడుతోంది. ఇక.. కాంగ్రెస్‌ తన వ్యూహం తాను రచిస్తోంది. వీరికితోడు కొందరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులూ ఈ స్థానం మీద దృష్టి పెట్టారు.

Also Read: తెలంగాణ మళ్లీ టాప్.. గొప్ప విజయం

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎలాగూ సిట్టింగ్‌ స్థానమే కాబట్టి.. మరోసారి తమ అభ్యర్థినే గెలిపించుకోవాలని టీఆర్‌‌ఎస్‌ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మంత్రి హరీష్‌రావుకు ఇన్‌చార్జి ఇచ్చనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కే ఓట్లేస్తామని పలు గ్రామాల ప్రజలతో ఏకగ్రీవంగా తీర్మానాలు చేయించారు. ఇప్పుడున్న పరిస్థితులను అంచనా వేస్తూ తమ అభ్యర్థి 50 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని టీఆర్‌‌ఎస్‌ అధిష్టానం ధీమాతో ఉంది. అయితే.. క్యాండిడేట్‌ ఎవరా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. రామలింగారెడ్డి సతీమణికే అభ్యర్థిగా ప్రకటిస్తారని భావిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అన్ని పార్టీల నుంచి అభ్యర్థుల విషయం క్లారిటీ వచ్చినా.. ఈ పార్టీలో మాత్రం ఇంకా ఎవరనేది బయటపెట్టడం లేదు. తూంకుంట నర్సారెడ్డి, కోమటిరెడ్డి వెంకటనరసింహారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌ రెడ్డిని తిరిగి చేర్చుకుని టికెట్‌ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక బండి సంజయ్‌కి రాష్ట్రంలో వస్తున్న ఫస్ట్‌ ఎన్నికలు ఇవి. దీంతో ఈ పార్టీకి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే అని చెప్పాలి. 2014,2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్‌రావుకే మరోసారి పార్టీ టికెట్‌ ఇస్తున్నారు. దీంతో ఆయన ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. స్థానకంగా మరికొందరు టికెట్‌ ఆశిస్తున్నా.. అధిష్టానం రఘునందన్‌రావు వైపే మొగ్గు చూపుతోంది. ఈసారి సింపతి వర్కవుట్‌ అవుతుందనే ధీమాతో ఉన్నారు.

Also Read: బుద్ది తక్కువై పవన్ ను నమ్మాం.. పవన్ మూడు పెళ్లిళ్ల మాసికం: నారాయణ

ఇక.. తెలంగాణలో చర్చలో లేని మరోపార్టీ టీడీపీ. ఇప్పుడు ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్‌.రమణ వ్యవహరిస్తున్నారు. అయితే.. టీడీపీ కూడా ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టే ఆలోచనలో ఉందట. కేడర్‌‌తో చర్చించి ఈ రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా ఈరోజు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకావాలు కనిపిస్తున్నాయి. సీపీఎం పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.గత ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలోకి దింపిన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ఈసారి పెద్దగా దృష్టి సారించడం లేదు. కొత్తగా ఇండిపెండెంట్లు రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కత్తి కార్తీక ప్రచార పర్వంలోకి దిగారు. మొత్తంగా చూస్తే ఈసారి దుబ్బాక ఉప ఎన్నిక చాలా ఆసక్తికరంగా మారింది.