భారత్ లో 3వేలకు పెరిగిన కరోనా కేసులు

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా(కోవిడ్-19) ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. క్రమంగా అన్ని దేశాలకు వ్యాపించింది. తాజాగా 10లక్షలకు పైగా కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యాయి. కొన్ని దేశాల్లో వైద్యం అందించేందుకు వైద్యులు సరిపోలేనంతగా కరోనా బాధితులు పెరిగింది. దీంతో చేసేదీమేక కొందరికీ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. కరోనా దాటికి అగ్రరాజ్యం విలవిలలాడిపోతుంది. 2లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. అందమైన ఇటలీ దేశం కరోనా దాటికి శవాలదిబ్బగా […]

Written By: Neelambaram, Updated On : April 4, 2020 12:42 pm
Follow us on


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా(కోవిడ్-19) ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. క్రమంగా అన్ని దేశాలకు వ్యాపించింది. తాజాగా 10లక్షలకు పైగా కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యాయి. కొన్ని దేశాల్లో వైద్యం అందించేందుకు వైద్యులు సరిపోలేనంతగా కరోనా బాధితులు పెరిగింది. దీంతో చేసేదీమేక కొందరికీ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

కరోనా దాటికి అగ్రరాజ్యం విలవిలలాడిపోతుంది. 2లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. అందమైన ఇటలీ దేశం కరోనా దాటికి శవాలదిబ్బగా మారింది. ఇక స్పెయిన్, బ్రిటన్ దేశాల్లో రాజకుటుంబీకులే కరోనా బారిన పడ్డారంటే సామాన్యుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కరోనా మహమ్మరితో ప్రపంచ దేశాలు కకావికలం అవుతోన్నాయి. భారత్ లోనూ కరోనా ఎంట్రీతో దేశంలో 21రోజులు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు గడిచిన రెండు మూడురోజులుగా ఎక్కువగా నమోదవుతుండటంతో ఆందోళన రేకెత్తిస్తోంది.

తాజాగా భారత్ లో 3వేలకు పైగా కరోనా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం భారత్ 3,127 కరోనా కేసులు నమోదుయ్యాయి. 229మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. 2,767 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 86మంది మృతిచెందారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడురోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 75కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కు చేరింది. 32మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 164కు చేరింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తయ్యాయి.