హైదరాబాద్ లో కరోనా పిడుగు, కేసీఆర్ ఆదేశాల కోసం పోలీసులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ అదుపు తప్పుతున్నట్లు ఆరోగ్య అధికారులు, పొలుసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒకేరోజు కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదై, మొత్తం కేసులు 74కు చేరుకోవడంతో దిగ్బ్రాంతికి గురవుతున్నారు. ఈ వారం ప్రారంభంలో ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో ఈ వైరస్ ఉనికి ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించడం తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజు నుండే నిజాముద్దీన్ లోని తాబ్లిఘి జామాతి ముంది తిరిగి వచ్చిన వారు పెద్ద […]

Written By: Neelambaram, Updated On : April 4, 2020 3:40 pm
Follow us on


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ అదుపు తప్పుతున్నట్లు ఆరోగ్య అధికారులు, పొలుసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒకేరోజు కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదై, మొత్తం కేసులు 74కు చేరుకోవడంతో దిగ్బ్రాంతికి గురవుతున్నారు.

ఈ వారం ప్రారంభంలో ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో ఈ వైరస్ ఉనికి ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించడం తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజు నుండే నిజాముద్దీన్ లోని తాబ్లిఘి జామాతి ముంది తిరిగి వచ్చిన వారు పెద్ద ఎత్తున వైరస్ బారిన పదిన్నట్లు బైట పడుతూ ఉండడంతో గత నాలుగు రోజులలో మొత్తం పాజిటివ్ కేసులు రెండింతలు పైగా పెరిగాయి. మృతుల సంఖ్య 11 కు చేరుకొంది.

అయినా ఇప్పటికి చాలామంది ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షకు సహకరించడం లేదని అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్న లేఖల కన్నా రెండింతల మంది ఢిల్లీ నుండి తిరిగి వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. తమకు స్వేచ్ఛ ఇస్తే వారందరిని జల్లెడ ఆడి పట్టుకొంటామని పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వెంటనే కఠిన చర్యలు తీసుకోనని పక్షంలో హైదరాబాద్ నగరాన్ని ఈ మహమ్మారి కాటేయడం తధ్యం అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి సన్నిహిత రాజకీయ మిత్రుడు కావడంతో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జనుకుతున్నట్లు కనిపిస్తున్నది.

ఈ విషయంలో కఠినంగా వ్యవహరింప వలసిందే అని ఆయన కుమారుడు, మునిసిపల్ పాలన శాఖ మంత్రి కెటి రామారావు కూడా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. లేని పక్షంలో దేశంలో చాల రాష్ట్రాలకన్నా ముందుగా, చివరకి ప్రధాన మంత్రి మోదీ కన్నా ముందుగా క్రియాశీలంగా వ్యవహరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి అంతా బూడిద కాగలదని ఆందోళన చెందుతున్నారు.

ఇంకా చాలామంది బైటకు రాకుండా గోప్యంగా ఉంటున్నారని, వారి గురించిన వివరాలు ఇవ్వడానికి వారి బంధువులు కూడా ఇష్ట పడటం లేదని, కరోనా చికిత్సకు వచ్చిన వారు సహితం వైద్య బృందాలపై అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణలోని మొత్తం పాజిటివ్ కేసులలో మూడోవంతు హైదరాబాద్ నగరం నుండే ఉండటం, మృతులలో అత్యధికంగా నగరం నుండే కావడంతో తక్షణం తగు చర్యలు తీసుకోవాలని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పటి వరకు వైద్య బృందాలకు సహకరింపమని ఒవైసి సోదరులు ముస్లిం సోదరులకు పిలుపు ఇవ్వక పోవడం గమనార్హం.