పవన్ చిత్రంలో బంపరాఫర్ దక్కించుకున్న తెలుగమ్మాయి?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాల్లో తెలుగు అమ్మాయిలు కీలక పాత్రల్లో కనిపించ బోతున్నారు దిల్ రాజు నిర్మిస్తున్న ` వకీల్ సాబ్ ` చిత్రం లో లేడీ పాత్రలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ముగ్గురు లేడీస్ చుట్టూ తిరిగే కథ ఇది . అలాంటి చిత్రంలో ఇద్దరు హీరోయిన్ స్థాయి పాత్రలకు అచ్చ తెలుగు అమ్మాయిలు అయిన అంజలి , అనన్య నాగళ్ళ లను ఎంపిక చేయడం జరిగింది. వాళ్లకి సంబందించిన షూటింగ్ కూడా […]

Written By: Neelambaram, Updated On : April 5, 2020 1:04 pm
Follow us on

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాల్లో తెలుగు అమ్మాయిలు కీలక పాత్రల్లో కనిపించ బోతున్నారు దిల్ రాజు నిర్మిస్తున్న ` వకీల్ సాబ్ ` చిత్రం లో లేడీ పాత్రలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ముగ్గురు లేడీస్ చుట్టూ తిరిగే కథ ఇది . అలాంటి చిత్రంలో ఇద్దరు హీరోయిన్ స్థాయి పాత్రలకు అచ్చ తెలుగు అమ్మాయిలు అయిన అంజలి , అనన్య నాగళ్ళ లను ఎంపిక చేయడం జరిగింది. వాళ్లకి సంబందించిన షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయ్యింది. కాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండో చిత్రం లో కూడా మరో అచ్చ తెలుగు అమ్మాయికి ఛాన్స్ దక్కింది.

వెరైటీ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ కచితళ్యాణ్ ఓ భారీ పీరియడ్ డ్రామాలో నటిస్తున్నాడు ప్రముఖ నిర్మాత ఏ. ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం 150 కోట్ల భారీ బడ్జట్ తో రూపొందుతోంది. అలాంటి చిత్రం లో ఓ స్పెషల్ సాంగ్ కొరకు మన తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడను తీసుకున్నారట. ఓ భారీ సెట్ లో ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయిందని తెలుస్తోంది. కాగా పూజిత పొన్నాడ గతంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన` కల్కి` సినిమాలో ఓ రోల్ చేయడమే గాక రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `రంగస్థలం` లో చిట్టి బాబు అన్నగా నటించిన ఆది పినిశెట్టి లవర్ పాత్ర కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పక్కన సాంగ్ చేసే అవకాశం దక్కించుకున్న ఈ తెలుగింటి ముద్దుగుమ్మ కి ఇది బంగారం లాంటి అవకాశమే …