అక్రమ సంబంధాల గుట్టు రట్టు చేస్తున్న కరోనా

నేడు ప్రపంచ వ్యాప్తంగా భయకంపితులను కావిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే 30 లక్షల మందికి పైగా సోకగా సోకింది. ఇప్పటి వరకు దీని కట్టడికి వ్యాక్సిన్ గాని, మందు గాని లేకపోవడంతో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంతో తెలియక తికమక పడుతున్నారు. ఇప్పటివరకు రాజకీయంగా, ఆర్ధికంగా ప్రపంచాన్ని ఆడిస్తున్న అగ్రరాజ్యాలే ఇప్పుడు ఈ వైరస్ కు కకావికలం అవుతున్నాయి. మరోవంక, అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు కరోనాతో ఎక్కడ బైటపడతాయో అనే అనేకమంది ఆందోళన చెందుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి […]

Written By: Neelambaram, Updated On : April 28, 2020 2:25 pm
Follow us on


నేడు ప్రపంచ వ్యాప్తంగా భయకంపితులను కావిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే 30 లక్షల మందికి పైగా సోకగా సోకింది. ఇప్పటి వరకు దీని కట్టడికి వ్యాక్సిన్ గాని, మందు గాని లేకపోవడంతో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంతో తెలియక తికమక పడుతున్నారు. ఇప్పటివరకు రాజకీయంగా, ఆర్ధికంగా ప్రపంచాన్ని ఆడిస్తున్న అగ్రరాజ్యాలే ఇప్పుడు ఈ వైరస్ కు కకావికలం అవుతున్నాయి.

మరోవంక, అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు కరోనాతో ఎక్కడ బైటపడతాయో అనే అనేకమంది ఆందోళన చెందుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి సాధార‌ణంగా ఒక‌రి నుంచి ఒక‌రికి వేగంగా విస్త‌రిస్తున్న‌ది. అందుకే ఎవ‌రిలోనైనా పాజిటివ్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే చాలు వారిని వెంట‌నే ఐసోలేషన్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారికి కూడా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. అయితే, ప్ర‌జ‌ల ప్రాణాలను రక్షించడం కోసం అధికారులు చేప‌డుతున్న ఈ చ‌ర్య‌లవ‌ల్ల అక్రమ సంబంధాలు కలిగి ఉన్న కొంద‌రి ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న‌ట్లుగా త‌యార‌య్యింది.

ఇటీవ‌ల భోపాల్‌లోని ఒక యువ‌తికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అందరిని అడిగిన‌ట్లుగానే ఆమె ప్రైమ‌రీ కాంటాక్టుల వివ‌రాల‌ను పోలీసులు ఆరాతీశారు. దీంతో ఆమె త‌న బాయ్‌ఫ్రెండ్‌ విషయం చెప్పింది. కూతురు చెప్పింది విని అప్ప‌టిదాకా ఆ విషయం తెలియ‌ని త‌ల్లిదండ్రులు షాకయ్యారు.

ఆమె బాయ్‌ఫ్రెండ్‌ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. భోపాల్‌ పట్టణానికే చెందిన మరో యువకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతని ప్రైమరీ కాంటాక్టుల వివరాలు అడగ్గా గర్ల్‌ఫ్రెండ్‌ విషయం చెప్పాడు. ఇప్పుడు షాకవడం పోలీసుల వంతయ్యింది.

ఎందుకంటే ఆ గర్ల్‌ ఫ్రెండ్‌ ఎవరా అని ఆరా తీసిన పోలీసులకు ముందుగా మరో బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్పిన యువతి, ఆ యువతి ఒక్కతేనని తెలిసింది. అంటే ఒకే యువతి ఒకరికి తెలియకుండా ఒకరిని ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌ తో చెలగాటమాడుతున్నది.

ఇక బెంగళూరులో ఇలాంటిదే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ఫార్మసీలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌కు తరలించి, అతని కొలీగ్స్‌, కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా అందరిలో నెగెటివ్‌ వచ్చింది.

మరి అతనికి కరోనా ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయం బయటపడింది. వెంటనే ఆమెను గుర్తించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ రెండు ఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే.

కరోనావల్ల నిత్యం ఇలాంటి అక్రమ సంబంధాలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. అయితే, కరోనా మహమ్మారి విస్తరణ మొదలైన తర్వాత కూడా తమ అక్రమ సంబంధాలను కొనసాగించిన వారు మాత్రమే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. కానీ, దేశంలో కరోనా కాలుమోపక ముందు నుంచే తమ సంబంధాలకు బ్రేక్‌ ఇచ్చిన వారు మాత్రం బతికిపోతున్నారు.