https://oktelugu.com/

సందీప్ వంగా మూడో చిత్రం హిందీలోనే

తెలుగు సినిమా ఇపుడు మార్పు కోరుకొంటోంది. ఆ క్రమంలో కొత్త దర్శకులు వెరైటీ కథలతో తెరమీదకి వస్తున్నారు. అలా `అర్జున్ రెడ్డి’ అనే బోల్డ్ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నాడు. యంగ్ డైరెక్టర్ సందీప్ వంగా అంతేకాదు ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దాంతో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ […]

Written By:
  • admin
  • , Updated On : April 28, 2020 / 02:37 PM IST
    Follow us on


    తెలుగు సినిమా ఇపుడు మార్పు కోరుకొంటోంది. ఆ క్రమంలో కొత్త దర్శకులు వెరైటీ కథలతో తెరమీదకి వస్తున్నారు. అలా `అర్జున్ రెడ్డి’ అనే బోల్డ్ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నాడు. యంగ్ డైరెక్టర్ సందీప్ వంగా అంతేకాదు ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దాంతో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన చిత్రం తో రెడీ అయ్యాడు. అయితే సందీప్ ఈ సారి బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో ఓ యాక్షన్ క్రైమ్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడట.

    నిజానికి సందీప్ వంగా తన మూడో సినిమాని తెలుగులో తీయాలని ప్రయత్నించాడు. కానీ తెలుగు హీరో లెవరూ ముందుకు రాలేదు. దాంతో సందీప్ వంగా తన మూడో సినిమాని హిందీలో తీయడానికి నిశ్చయించు కొన్నాడు. నిజానికి హిందీ నిర్మాతలు సందీప్ వంగా సినిమాల కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారట. ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాత లైన భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని సందీప్ వంగా తర్వాతి చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ గా ఉన్నారు. వీరితోపాటే సందీప్ వంగా అన్నయ్య , ప్రణయ్ వంగా కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కానున్నాడు . ఇక ఈ చిత్రానికి `డెవిల్ ` అనే టైటిల్ ని అనుకొంటున్నట్టు తెల్సింది .