
రాజ్ భవన్ లో సిబ్బంది కరోనా బారిన పడటానికి రాష్ట్ర ఎన్నికల అధికారితో ప్రమాణ స్వీకారం చేయించడమే కారణమని మాజీ మంత్రి టీడీపీ నేత జవహర్ ఆరోపించారు. అధికారం ఉందనే పొగరుతో రాష్ట్రంలో లాక్ డౌన్ నిబందనలు తుంగలో తొక్కి కరోనా పాజిటివ్ కేసులు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని జవహర్ పేర్కొన్నారు. ఈ మేరకు తన కార్యాలయం నుంచి సోమవారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా లాక్ డౌన్ విధిస్తే జగన్ ప్రభుత్వం మాత్రం నిర్లక్షదోరణితో రాజ్ భవన్లో ఈ నెల 11న నూతన ఎన్నికల అధికారిగా కనగరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. దీని కారణంగా రాజ్ భవన్లో పనిచేసి సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత లేని జగన్ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడని జవహర్ అన్నారు. విపత్కర సమయంలో చెన్నై నుంచి కనగరాజుని ఏ విధంగా తీసుకువచ్చి ఎన్నికల అధికారిగా ప్రమాణం చేయించారో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అదేవిధంగా రాష్ట్ర నూతన ఎన్నికల అధికారి కనగరాజు క్వారంటైన్లో ఉన్నారా లేక ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వెళ్లిపోయరా అంటూ జవహర్ మండిపడ్డారు.
కనగరాజు ప్రమాణంతో రాజ్ భవన్ కి కరోనా..
Most Popular
Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..
Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..
TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే
Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...
Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...
Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..
Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...


