Corona Virus: వచ్చే రెండు నెలలు డేంజర్.. కేంద్రం హెచ్చరిక

Corona Virus: ముచ్చటగా మూడో ముప్పు ఉందని ఓవైపు వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా కరోనా వైరస్ తీవ్రతపై చావుకబురును కేంద్రం చల్లగా చెప్పింది. రాబోయే నెలలు డేంజర్ అంటూ ప్రజలను హెచ్చరించింది. దేశం ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత చివరి దశకు వచ్చింది. అయితే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనేక పండుగలు ఉండడంతో ఇది థర్డ్ వేవ్ (Third Wave)కు దారితీయవచ్చని కేంద్రం తాజాగా ప్రజలను హెచ్చరించింది. కరోనా థర్డ్ […]

Written By: NARESH, Updated On : August 26, 2021 6:36 pm
Follow us on

Corona Virus: ముచ్చటగా మూడో ముప్పు ఉందని ఓవైపు వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా కరోనా వైరస్ తీవ్రతపై చావుకబురును కేంద్రం చల్లగా చెప్పింది. రాబోయే నెలలు డేంజర్ అంటూ ప్రజలను హెచ్చరించింది. దేశం ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత చివరి దశకు వచ్చింది. అయితే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనేక పండుగలు ఉండడంతో ఇది థర్డ్ వేవ్ (Third Wave)కు దారితీయవచ్చని కేంద్రం తాజాగా ప్రజలను హెచ్చరించింది.

కరోనా థర్డ్ వేవ్ రాకుండా ఈ రెండు నెలలే అత్యంత కీలకమని కేంద్రప్రభుత్వం తెలిపింది. ప్రజలంతా తగిన జాగ్రత్తలతో పండుగలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో కోవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ సంచలన హెచ్చరికలు చేశారు. వ్యాక్సిన్లు కేవలం కరోనా నుంచి రక్షణ మాత్రమే కల్పిస్తాయని.. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా తప్పనిసరిగా మాస్కులు వాడాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలో కరోనా కల్లోలం ప్రస్తుతానికి ఒక్క కేరళ రాష్ట్రంలోనే నెలకొంది. దేశవ్యాప్తంగా గత వారంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల్లో 58.4శాతం ఒక్క కేరళలోనే నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 3.33 లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. వాటిలో లక్షన్నరకు పైగా కేరళలోనే ఉన్నాయని తేల్చారు.

ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో 10వేలు నుంచి లక్ష మధ్య ఉండగా.. 31 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం 10వేల కన్నా తక్కువ ఉన్నట్టు వివరించారు. దేశంలోని 41 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశం కోవిడ్ సెకండ్ వేవ్ మధ్యలో ఉందని కేంద్ర ఆరోగ్యకార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. నిన్న నమోదైన కొత్త కేసుల్లో దాదాపు 58శాతం కేరళలోనే వెలుగుచూసినట్టు ఆయన వెల్లడించారు.

దేశంలోని మొత్తం కేసుల్లో 51శాతం కేరళలోనే నమోదు కాగా.. మహారాష్ట్రలో 16.01శాతం, కర్ణాటకలో 5.8శాతం, తమిళనాడులో 5.5 ఏపీలో 4.21శాతం ఉన్నట్టుగా కేంద్రం తెలిపింది.