Indira Park: పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు.. ఇందిరా పార్కులో కలకలం?

Indira Park: పార్క్ అంటే తెలుగులో ఉద్యానవనం. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆహ్లాదం కోసం పార్కులకు వెళుతుంటారు. అక్కడ సేద తీరి ప్రశాంతంగా తమ ఇళ్లకు చేరుకుంటారు. రాష్ర్టంలోని అన్ని నగరాల్లో పార్కులు ఉన్నాయి. అయితే ఒక్కో పార్కుకు ఒక్కో విశిష్టత ఉంటుంది. హైదరాబాద్ లో పెద్ద పెద్ద పార్కులున్నాయి. కానీ చాలా చోట్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో శృంగార కార్యకలాపాలు కూడా చోటుచేసుకుంటాయని తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. చాలా […]

Written By: Srinivas, Updated On : August 27, 2021 12:51 pm
Follow us on

Indira Park: పార్క్ అంటే తెలుగులో ఉద్యానవనం. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆహ్లాదం కోసం పార్కులకు వెళుతుంటారు. అక్కడ సేద తీరి ప్రశాంతంగా తమ ఇళ్లకు చేరుకుంటారు. రాష్ర్టంలోని అన్ని నగరాల్లో పార్కులు ఉన్నాయి. అయితే ఒక్కో పార్కుకు ఒక్కో విశిష్టత ఉంటుంది. హైదరాబాద్ లో పెద్ద పెద్ద పార్కులున్నాయి. కానీ చాలా చోట్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో శృంగార కార్యకలాపాలు కూడా చోటుచేసుకుంటాయని తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. చాలా చోట్ల అలాంటివి మా పార్కులలో జరగవని చెబుతుంటారు.

హైదరాబాద్ లోని ఉద్యానవనాలు ప్రజలతో నిండిపోతాయి. ఎటు చూసినా జంటలే కనిపిస్తాయి. జంటలకు ప్రధానంగా అనువుగా ఉంటే పార్కుల వెంటే పరుగులు పెడుతుంటారు. వీకెండ్ అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. సరదాగా గడుపుతుంటారు. మససు ప్రశాంతంగా ఉండేందుకు పార్కును ఎంచుకుంటారు. నగరంలో ప్రజలు పార్కులకు వెళ్లేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

హైదరాబాద్ నగరంలో పార్కులు వందల సంఖ్యలో ఉన్నాయి. దోమలగూడ ప్రాంతంలో ఇండే ఇందిరాపార్కు (Indira Park) నిత్యం సందర్శకులతో కిక్కిరిసి కనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పార్కు తెరిచే ఉంటుంది. దీంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇందిరా పార్కు వద్ద తాజాగా ఓ బ్యానర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పెళ్లి కాని జంటలకు పార్కులో ప్రవేశం లేదు అని బ్యానర్ వెలిసింది. దీంతో జంటలు ఏంచేయాలో అని సందేహంలో పడిపోతున్నాయి. ఇన్నాళ్లు పార్కులో సరదాగా ఎంజాయ్ చేసిన జంటలు ప్రస్తుతం బ్యానర్ చూసి నివ్వెరపోతున్నాయి. మేనేజ్ మెంట్ తీసుకున్న నిర్ణయంపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెళ్లి కాకపోతే పార్కులోకి రానివ్వకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

బ్యానర్ ఎవరు ఏర్పాటు చేశారో కానీ పెళ్లి కాని వారికి ప్రవేశం లేదు అని చెప్పడంతో అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అందరి నుంచి విమర్శలు రావడంతో బ్యానర్ ను మాత్రం అక్కడి నుంచి తొలగించడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. జంటలకు ప్రవేశం లేదని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా అధికారుల తీరుతో ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారని మాత్రం తెలుస్తోంది.