https://oktelugu.com/

కరోనా టీకా కొందరికేనా..?

దేశంలో ఏ ఎన్నిక జరిగినా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇస్తోంది. ప్రధాని మోడీ కూడా దేశంలో వాక్సిన్‌ తయారీ చేస్తున్న ఫార్మాప్లాంట్ల చుట్టూ తిరుగుతున్నారు. వ్యాక్సిన్‌ ఎంతవరకు వచ్చిందో తెలుసుకొని త్వరగా అందుబాటులోకి తేవాలని ఆదేశిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, వ్యాక్సిన్ అందరికీ అవసరం లేదని కేంద్రం ప్రకటన చేయడమే ఆందోళన కలిగిస్తోంది. Also Read: హాట్ టాపిక్.. జాతీయగీతం మారబోతుందా? వైరస్‌ వ్యాప్తిని […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 2, 2020 / 03:10 PM IST
    Follow us on


    దేశంలో ఏ ఎన్నిక జరిగినా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇస్తోంది. ప్రధాని మోడీ కూడా దేశంలో వాక్సిన్‌ తయారీ చేస్తున్న ఫార్మాప్లాంట్ల చుట్టూ తిరుగుతున్నారు. వ్యాక్సిన్‌ ఎంతవరకు వచ్చిందో తెలుసుకొని త్వరగా అందుబాటులోకి తేవాలని ఆదేశిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, వ్యాక్సిన్ అందరికీ అవసరం లేదని కేంద్రం ప్రకటన చేయడమే ఆందోళన కలిగిస్తోంది.

    Also Read: హాట్ టాపిక్.. జాతీయగీతం మారబోతుందా?

    వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే ఉద్దేశమట

    కరోనా వైరస్‌ వ్యాప్తి ఆపడమే వ్యాక్సిన్‌ ప్రధాన ఉద్దేశమని, అవసరమైన వారికి ఇస్తే చాలని ఐసీఎంఆర్ చెబుతోంది. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీకా సామాన్య ప్రజల వరకు వస్తుందా అన్న సందేహం కలుగుతోంది. సమాజంలో డబ్బులున్న వారు ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. వాళ్లు డబ్బులు పెట్టి అయినా టీకా కొంటారు.

    ఉత్పత్తి కష్టం కావడంతోనే..!

    ప్రస్తుతం దేశంలో రెండీ అవుతున్న టీకాలు కొన్ని ట్రయల్స్‌ దశలో ఉంటే మరికొన్ని స్టేజీ 2,3లో ఉన్నాయి. వీటిని కేంద్రం అనుమతి ఇచ్చినా దేశంలోని 130 కోట్ల జనాబాకు ఉత్పత్తి చేయడం అంత తేలిక కాదు. అందుకే కేంద్రం అవసరమైన వాళ్లకే ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read: కేంద్రం వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత ఎందుకు?

    మరి హామీలు ఇవ్వడం ఎందుకో..?

    అవసరమైన వాళ్లకే టీకా ఇస్తామని ఐసీఎంఆర్‌‌ చెబుతుంటే… బీజేపీ మాత్రం టీకా ఫ్రీ అంటూ హామీలు ఇవ్వడం ఏంటని జనాలు ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్‌‌ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాల కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్