ఎర్రజెండా నర్సింహయ్యనే..!

నోముల నర్సింహయ్య… టీఆర్‌‌ఎస్‌ పార్టీ నుంచి నాగర్జున సాగర్‌ ఎమ్మెల్యేగా నే ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆయన సీపీఎం పార్టీలో సుధీర్ఘకాలం పనిచేశారు. ఎన్నో ప్రజా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అందుకేనేమో ఆయన చనిపోయే ముందు ఎర్రజెండా పార్టీని పలువరించారు. పాత మిత్రులకు ఫోన్‌ చేసి గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఎర్రజెండా నర్సింహయ్యగానే వీడ్కోలు చెప్పాలని కోరారు… అవును.. మంగళవారం మృతి చెందిన నోముల నర్సింహయ్యమాట్లాడిన అడియో రికార్డులు వైరల్‌ అవుతున్నాయి. తన మిత్రులను, కమ్యునిస్టు […]

Written By: Srinivas, Updated On : December 2, 2020 3:01 pm
Follow us on


నోముల నర్సింహయ్య… టీఆర్‌‌ఎస్‌ పార్టీ నుంచి నాగర్జున సాగర్‌ ఎమ్మెల్యేగా నే ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆయన సీపీఎం పార్టీలో సుధీర్ఘకాలం పనిచేశారు. ఎన్నో ప్రజా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అందుకేనేమో ఆయన చనిపోయే ముందు ఎర్రజెండా పార్టీని పలువరించారు. పాత మిత్రులకు ఫోన్‌ చేసి గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఎర్రజెండా నర్సింహయ్యగానే వీడ్కోలు చెప్పాలని కోరారు… అవును.. మంగళవారం మృతి చెందిన నోముల నర్సింహయ్యమాట్లాడిన అడియో రికార్డులు వైరల్‌ అవుతున్నాయి. తన మిత్రులను, కమ్యునిస్టు నేతలను ఉద్దేశించి ఆయన ఇలా మాట్లాడారు….

Also Read: పోలింగ్ శాతం తగ్గడం ఎవరికి లాభం?

‘భగవంతుడు నన్ను పిలిచాడు. ఎర్రజెండా నర్సింహయ్యగానే నా అంతిమ సంస్కారాలను నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమందిని తెలిసో, తెలియకో ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అన్యథా భావించొద్దు. నర్రా రాఘవరెడ్డి శిష్యుడిగా, నకిరేకల్ ఎర్రజెండా బిడ్డగా.. ఎర్రజెండా బిడ్డగానే నన్ను సాగనంపుతారని కోరుకుంటున్నాను. ఇదే చివరి రాత్రి. ఆఖరు మాటలుగా భావించండి. రేపటి భవిష్యత్‌ అంతా కమ్యునిస్టు పార్టీలది. మీరంతా కమ్యునిస్టు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు.

మరో ఆడియో రికార్డులో..

భారత కమ్యునిస్టు, మార్క్సిస్టు మిత్రులకు… పార్టీని ముందుకు తీసుకు వెళ్లడానికి కంకణబద్ధులైనటువంటి కామ్రేడ్ కళాకారుల సోదరులకు పేరుపేరునా … విప్లవ కళాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ నర్సింహయ్యగా.. మీ ఎర్రజెండా నర్సింహయ్యగా నేను కోరుకునేది ఒక్కటే. మీ అందరినీ ఎడబాసి ఏడేళ్లు గడిచాయి. ఏడేడు లోకాలకు అందకుండా పోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఆ పరిస్థితి వస్తదని కూడా నేను కలగలనలేదు. భగవంతుడు నన్ను పిలిచినాడు… నేను వెళతా ఉన్నా. మీరంతా మీ ఎర్రజెండా నర్సింహయ్యగా నా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’

Also Read: గ్రేటర్‌‌ ఓటర్లకేమైంది..?

సీపీఎంను వీడి టీఆర్‌‌ఎస్‌లోకి..

నోముల నర్సింహయ్య అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా.. సీపీఎంతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని పక్కనపెట్టి గులాబీ కండువా కప్పుకున్నారు. 2014లో నాగార్జున సాగర్ నుంచి పోటి చేసి ఓడిపోయారు. 2018లో మళ్లీ అక్కడి నుంచే పోటీ చేసి అప్పటి సీఎల్పీ నేత జానారెడ్డిపై గెలుపొంది చరిత్ర సృష్టించారు. కాగా, నోముల నర్సింహయ్యవిగా చెబుతున్న ఫోన్ రికార్డులు ఫేక్ అని టీఆర్‌‌ఎస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారని అందులో ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్