https://oktelugu.com/

వైజ‌యంతీ మూవీస్ త‌దుప‌రి చిత్రంలో ప్ర‌భాస్ జోడీ‌గా దీపికా !

ఆ హిస్టారిక్ పెయిర్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌!! ఒక‌రేమో సౌత్‌కు చెందిన మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ యాక్ట‌ర్‌.. ఇంకొక‌రేమో నార్త్‌కు చెందిన మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ యాక్ర్టెస్‌..అలాంటి ఆ ఇద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేయ‌నున్నారంటే ఏ రేంజ్ ఇంట‌రెస్ట్ ఆడియెన్స్‌లో నెల‌కొంటుందో ఊహించుకోవ‌చ్చు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే అలాంటి బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ‘బాహుబ‌లి’ సినిమా ఎప్పుడైతే విడుద‌లైందో, అప్పుడే అసాధార‌ణ మాస్ ఇమేజ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా అవ‌త‌రించారు ప్ర‌భాస్‌. […]

Written By:
  • admin
  • , Updated On : July 19, 2020 / 04:33 PM IST
    Follow us on


    ఆ హిస్టారిక్ పెయిర్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌!!

    ఒక‌రేమో సౌత్‌కు చెందిన మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ యాక్ట‌ర్‌.. ఇంకొక‌రేమో నార్త్‌కు చెందిన మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ యాక్ర్టెస్‌..అలాంటి ఆ ఇద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేయ‌నున్నారంటే ఏ రేంజ్ ఇంట‌రెస్ట్ ఆడియెన్స్‌లో నెల‌కొంటుందో ఊహించుకోవ‌చ్చు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే అలాంటి బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది.

    ‘బాహుబ‌లి’ సినిమా ఎప్పుడైతే విడుద‌లైందో, అప్పుడే అసాధార‌ణ మాస్ ఇమేజ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా అవ‌త‌రించారు ప్ర‌భాస్‌. ఆయ‌న స్టార్‌డ‌మ్ కేవ‌లం ఇండియాకే ప‌రిమితం కాకుండా అంత‌ర్జాతీయంగానూ విస్త‌రించింది. ప్ర‌భాస్ అంటే చార్మ్‌, మాచిస్మో, స్వాగ్‌, ట్రెమండ‌స్ యాక్టింగ్ టాలెంట్ క‌ల‌బోత‌. కోట్లాది మంది అభిమాన గ‌ణానికి ‘డార్లింగ్‌’. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లోనే ఆల్‌టైమ్ హ‌య్యెస్ట్ బాక్సాఫీస్ గ్రాస‌ర్ యాక్ట‌ర్‌గా ప్ర‌భాస్ రికార్డింగ్ బ్రేకింగ్ క‌రిష్మా.. ప్రేక్ష‌కుల నుంచి ఆయ‌న‌ పొందుతున్న ప్రేమ‌కు నిద‌ర్శ‌నం.

    Also Read: నా బయోపిక్‌లో నేనే నటిస్తా అంటున్న స్టార్ విలన్‌

    మ‌రోవైపు దీపికా ప‌దుకోనే విష‌యానికొస్తే, భార‌తీయ సినిమాలో అత్యంత స‌క్సెస్‌ఫుల్‌, అత్యధిక అభిమాన గ‌ణం ఉన్న తార‌ల్లో ఒక‌రిగా పేరు పొందారు. ఇటీవ‌లి కాలంలో ఆమె సాధించిన విజ‌యాలు ఆమెను ఈ దేశ‌పు బిగ్గెస్ట్ రోల్ మోడ‌ల్స్‌లో ఒక‌రిగా నిలిపాయి. త‌న టాలెంట్‌, క‌మిట్‌మెంట్‌, డెడికేష‌న్‌, డిసిప్లిన్‌, హార్డ్‌వ‌ర్క్‌తో ఐక‌నిక్ స్టేట‌స్‌ను అందుకున్నారు దీపికా ప‌దుకోనే.

    “Beyond Thrilled!Cannot wait for what we believe is going to be an incredible journey ahead…❤️❤️❤️ #DeepikaPrabhas @nagashwin7 @VyjayanthiFilms #Prabhas ,” అని ట్వీట్ చేశారు దీపిక‌.

    ఇలాంటి అద్వితీయ కాంబినేష‌న్ వైజ‌యంతీ మూవీస్‌, నిర్మాత సి. అశ్వినీద‌త్‌, స‌హ నిర్మాత‌లు స్వ‌ప్నా ద‌త్‌, ప్రియాంకా ద‌త్‌, డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ల‌కే సాధ్య‌మైంది.

    ఈ ప్రాజెక్ట్ గురించి నాగ్ అశ్విన్ ఉద్వేగంతో మాట్లాడుతూ, “ఈ సినిమాలోని హీరోయిన్‌ క్యారెక్ట‌ర్‌ను దీపిక చేయ‌నుండ‌టం న‌న్నెంతో ఎక్జైటింగ్‌కు గురి చేస్తోంది. ఇదివ‌ర‌కు మెయిన్‌స్ట్రీమ్‌లో ఇలాంటి కాంబినేష‌న్ సంభ‌వించ‌లేదు. అందువ‌ల్ల అంద‌రికీ ఇది ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఈ సినిమాలోని మెయిన్ హైలైట్స్‌లో దీపిక‌, ప్ర‌భాస్ జంటగా క‌నిపించ‌డం ఒక‌టి. వాళ్ల మ‌ధ్య న‌డిచే క‌థ రానున్న సంవ‌త్స‌రాల్లో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో గాఢ‌మైన ముద్ర వేస్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను” అన్నారు.

    నిర్మాత‌, వైజ‌యంతీ మూవీస్ వ్య‌వ‌స్థాప‌కులు అయిన సి. అశ్వినీద‌త్ మాట్లాడుతూ, “ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీపై చెర‌గ‌ని ముద్ర వేసిన వారి జాబితాలో మా స్థానాన్ని ప‌దిలం చేసుకోవ‌డానికి ఈ సినిమా మాకో సువ‌ర్ణావ‌కాశం. అలాగే, అసాధార‌ణ సినిమాటిక్ టాలెంట్స్‌ను క‌ల‌ప‌డం ద్వారా భార‌తీయ ప్రేక్ష‌కుల‌కు ఇదివ‌ర‌కెన్న‌డూ రుచిచూడ‌ని అనుభ‌వాన్ని ఇచ్చేందుకు కూడా ఇది మాకో గొప్ప అవ‌కాశం” అని చెప్పారు.

    Also Read: మామా ఏక్‌ సాల్‌ హోగయా అంటున్న రామ్

    స‌హ నిర్మాత‌లు స్వ‌ప్నా ద‌త్‌, ప్రియాంకా ద‌త్ మాట్లాడుతూ, “ఇలాంటి గొప్ప‌, ఉద్వేగ‌భ‌రిత న్యూస్‌తో భార‌తీయ సినిమాలో మా మ‌ర‌పురాని 50 సంవ‌త్స‌రాల ప్ర‌యాణాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటుండ‌టం అమిత‌మైన థ్రిల్‌ను క‌లిగిస్తోంది. నాగ్ అశ్విన్ ఫిల్మ్‌లో, ప్ర‌భాస్‌తో తెర‌పై ఒక అసాధార‌ణ మ్యాజిక్‌ను క్రియేట్ చేయ‌డానికి దీపికా ప‌దుకోనే లాంటి అద్భుత‌మైన న‌టిని తీసుకురావ‌డం కంటే మా గోల్డెన్ జూబిలీ మార్క్‌కు ఇంకేం కావాలి!” అన్నారు.

    సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో రూపొంద‌నున్న ఈ చిత్రం.. ప్రొడ‌క్ష‌న్‌లో ఉన్న మోస్ట్ ఎక్జ‌యిటింగ్ ఫిలిమ్స్‌లో ఒక‌టి అనేది నిస్సందేహం.

    వైజ‌యంతీ మూవీస్ వ్య‌వ‌స్థాప‌కులైన నిర్మాత సి. అశ్వినీద‌త్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరుపొందిన వ్య‌క్తి. భారీ, క్రేజీ చిత్రాల నిర్మాణానికి పేరుప‌డిన ఆ సంస్థ ఇప్ప‌టిదాకా తీసిన అనేకానేక లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీస్‌తో ఇటు ప్ర‌శంస‌ల‌నూ, అటు కీర్తి ప్ర‌తిష్ఠ‌ల‌నూ ఆర్జించింది.