గతేడాది కరోనా వైరస్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ వైరస్‌కు ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా..? వైరస్ బారి నుంచి ఎప్పుడ బయటపడుతామా..? అని భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు వైరస్ వ్యాక్సిన్ వచ్చింది. అదే టైమ్‌లో వైరస్ ముప్పు కూడా తగ్గింది. పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. అయినా.. దేశంలో కరోనా వైరస్ అయితే ఇంకా పోలేదు.. కానీ ప్రజల్లో మాత్రం భయం కంప్లీట్‌గా తొలగిపోయింది. ఇప్పటికీ భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజూ పదివేలకు పైగానే నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ సుమారు 1.55 లక్షల మంది కరోనాతో మరణించారు. ఇంకా మరణిస్తున్న వారి సంఖ్య రోజుకు రెండు వందలకు పైగానే ఉంటోంది. అయినా దేశంలో సాధారణ పరిస్థితుుల నెలకొన్నాయి.
Also Read: టీడీపీ నిధుల వేట..: ముందుకు రాని క్యాడర్
భయం వీడిన ప్రజలు మాస్క్‌లను పక్కన పెట్టేశారు. శానిటైజర్ల వినియోగం తగ్గింది. డిసెంబరు నెల నుంచి శానిటైజర్ వినియోగం పూర్తిగా తగ్గిపోయిందని, వాటి అమ్మకాలు కూడా పడిపోయాయని తెలుస్తోంది. ఇప్పటికి భారత్‌లో 1,10 కోట్ల మందికి కరోనా సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. కోలుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 1.03 కోట్ల మంది కరోనా సోకి కోలుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అయితే.. కరోనాను ఇంకా ఇప్పుడే లైట్ తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఇంకా ఇప్పటికీ కరోనా వైరస్ ఉందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ దేశాన్ని విడిచి వెళ్లలేదని, కనీస జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. కానీ.. ప్రజలు పట్టించుకోవడం లేదు. నిబంధనలన్నింటికీ మినహాయింపులు ఇచ్చేశారు. లాక్ డౌన్‌లో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలే పట్టించుకోవడం లేదు. సినిమా హాళ్లు తెరిచారు. సభలు, సమావేశాలు పెద్దయెత్తున జరగుతున్నాయి.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
ఇక కరోనా వ్యాక్సిన్ వచ్చిందని సంబరపడ్డారు. ఇప్పటికే దేశంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే.. ఈ వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ప్రజలు సుముఖంగా లేరు. దీనికి కారణం కేవలం ఆరు నెలల్లోనే వ్యాక్సిన్ రావడం, దాని ఫలితాలు కొన్ని చోట్ల వికటించడం వంటి వాటితో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇష్టపడటం లేదు. వ్యాక్సిన్ వేసుకోకున్నా పరవాలేదన్న ధోరణిలో ప్రజలు ఉన్నారు.
మరిన్ని జాతీయం రాజకీయ వార్తల కోసం జాతీయం పాలిటిక్స్