https://oktelugu.com/

వర్షిణి కోసం ‘శేఖర్ మాస్టర్ – హైపర్ ఆది’ మధ్య ఫైట్ !

బుల్లితెర పై శేఖర్ మాస్టర్ కి ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంది. ఆయనగారి మాస్ స్టెప్పులకి, అలాగే ఆయనగారి దిమ్మతిరిగే సెటైర్లకి అభిమానులు ఉన్నారు. అందుకే శేఖర్ మాస్టర్ కూడా సాంగ్ కైనా, బోల్డ్ స్టెప్స్ కైనా ఎప్పుడూ రెడీగా ఉంటాడు. అయితే ఢీ షోలో, అప్పుడప్పుడు జబర్దస్త్ వేదికపై శేఖర్ మాస్టర్ వేసే సెటైర్స్ బాగా వర్కౌట్ అవొచ్చు.. అంతమాత్రాన ఆయన కామెంట్స్ పరిధి దాటితే ఎలా ? తాజాగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న […]

Written By:
  • admin
  • , Updated On : February 8, 2021 / 11:08 AM IST
    Follow us on


    బుల్లితెర పై శేఖర్ మాస్టర్ కి ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంది. ఆయనగారి మాస్ స్టెప్పులకి, అలాగే ఆయనగారి దిమ్మతిరిగే సెటైర్లకి అభిమానులు ఉన్నారు. అందుకే శేఖర్ మాస్టర్ కూడా సాంగ్ కైనా, బోల్డ్ స్టెప్స్ కైనా ఎప్పుడూ రెడీగా ఉంటాడు. అయితే ఢీ షోలో, అప్పుడప్పుడు జబర్దస్త్ వేదికపై శేఖర్ మాస్టర్ వేసే సెటైర్స్ బాగా వర్కౌట్ అవొచ్చు.. అంతమాత్రాన ఆయన కామెంట్స్ పరిధి దాటితే ఎలా ? తాజాగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాంకు శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వెళ్తున్నాడు. అయితే అనసూయ, రష్మీలతో పోటీగా కామెడీ షోస్ కి కూడా యాంకరింగ్ మొదలుపెట్టింది వర్షిణి.

    Also Read: కొత్తరకం లుక్ లో యంగ్ హీరో !

    అనసూయ, రష్మీ అంత కాకపోయినా వర్షిణి కూడా ఎప్పటికప్పుడు సెక్సీ డ్రెస్ లతో బూతు మాటలతో యూత్ ను ఆకట్టుకోవడానికి బాగానే కష్టపడుతుంది. అలాగే తన నవ్వులతోనూ ఈ కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ ను నడపాలని తెగ ఆరాటపడుతుంది. అయితే వర్షిణి గతంలో ఢీ షోలో హోస్ట్ గా చేయడం, అప్పుడు హైపర్ ఆదితో కలిసి రొమాన్స్ కూడా పండించడంతో ఈ జంట పై క్రేజీ రూమర్సే వచ్చాయి. కానీ ఇప్పుడు సడెన్ గా మల్లెమాలకు టాటా చెప్పి, హైపర్ ఆదిని వదిలేసి, కామెడీ స్టార్స్ యాంకర్ గా కొత్త అవతారం ఎత్తింది వర్షిణి.

    Also Read: రోడ్ల మీదకు వస్తున్నా.. బాలయ్య వ్యాఖ్యలు వైరల్ !

    కాగా వర్షిణి వ్యవహారం వెనుక శేఖర్ మాస్టర్ ప్రోద్బలం ఉందట, మొదట వర్షిణి, హైపర్ ఆది కలిసి ఓ ప్రత్యేక ప్రోగ్రాంను మల్లెమాల ఆధ్వర్యంలో చేయడానికి సన్నాహాలు చేసుకున్నారట. మధ్యలో శేఖర్ మాస్టర్ వర్షిణికి మంచి ఆఫర్ ఇవ్వడంతో, వర్షిణి జెండా ఎత్తేసి స్టార్ మాలో అడుగుపెట్టేసిందని తాజాగా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో హైపర్ ఆది అసహనానికి గురై శేఖర్ మాస్టర్ పై చాటుగా కొన్ని కామెంట్స్ చేశాడని తెలుస్తోంది. దాంతో శేఖర్ మాస్టర్ హైపర్ ఆదికి ఫోన్ చేసి డైరెక్ట్ గానే బూతులు తిట్టాడని అంటున్నారు. ఈ మధ్య శేఖర్ మాస్టర్ కామెంట్స్ హద్దులు దాటుతున్నాయని కూడా టాక్ ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్