ఆ జిల్లాకు చేరిన కరోనా..!

కరోనా వైరస్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టేసింది. మార్చి 12వ తేదీన నెల్లూరులో తొలికేసు గుర్తించారు. కొద్దీ రోజుల కిందటి వరకూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ వైరస్ జాడ లేదు. కొద్దీ రోజుల కిందట శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తొలుత ఒకరికి, అనంతరం ఐదుగురికి ఈ వైరస్ సోకింది. తాజాగా విజయనగరం జిల్లాలో వైరస్ ప్రవేశించింది. ఏపీలో మరోసారి మద్యం బంద్..! విజయనగరం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు బుధవారం నమోదు అయ్యింది. బలిజిపేట […]

Written By: Neelambaram, Updated On : May 6, 2020 5:24 pm
Follow us on


కరోనా వైరస్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టేసింది. మార్చి 12వ తేదీన నెల్లూరులో తొలికేసు గుర్తించారు. కొద్దీ రోజుల కిందటి వరకూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ వైరస్ జాడ లేదు. కొద్దీ రోజుల కిందట శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తొలుత ఒకరికి, అనంతరం ఐదుగురికి ఈ వైరస్ సోకింది. తాజాగా విజయనగరం జిల్లాలో వైరస్ ప్రవేశించింది.

ఏపీలో మరోసారి మద్యం బంద్..!

విజయనగరం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు బుధవారం నమోదు అయ్యింది. బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన మహిళకు స్వాబ్ టెస్టింగ్ లో కరోనా పాజిటివ్ వచ్చింది. కిడ్నీ సమస్య తో బాధపడుతూ విశాఖపట్నం వెళ్లిన ఆమెకు అక్కడ పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ గా నిద్దరణ అయ్యింది.

అల్లుడి అరాచకాలపై కొరడా ఝుళిపించండి..!

ఆమె కొడుకులు ద్వారా ఆమెకి కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సభ్యులు అందరని జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రికి తీసుకొచ్చి కరోనా టెస్టులు చేస్తున్నట్లు తెలిపిన డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ ఎస్.వి. రమణ కుమారి తెలిపారు. వీళ్లు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారనే సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలుసుకుంటున్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు విజ్ఞప్తి చేశారు.