ఆగని వలస కూలీల నిరసనలు!

లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి, 43 రోజులుగా పనిలేక, తినడానికి తిండిలేక నానా అవస్థలు పడుతున్న వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయం తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇప్పటికైనా తమను సొంతూళ్లకు పంపించాలని అధికారులను వేడుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలను స్వస్థలాలకు  తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో వారిలో ఆశలు చిగురించాయి. ఎలాగైనా స్వస్థలానికి చేరుకోవాలని ఆరాటపడుతున్నారు. విశాఖలోని హెచ్‌పీసీఎల్‌, ఎల్‌అండ్‌టీ కంపెనీల్లో పనిచేస్తున్న వందలాది మంది కూలీలు స్వరాష్ట్రాలకు పంపాలంటూ గాజువాకలో […]

Written By: Neelambaram, Updated On : May 6, 2020 7:30 pm
Follow us on

లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి, 43 రోజులుగా పనిలేక, తినడానికి తిండిలేక నానా అవస్థలు పడుతున్న వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయం తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇప్పటికైనా తమను సొంతూళ్లకు పంపించాలని అధికారులను వేడుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలను స్వస్థలాలకు  తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో వారిలో ఆశలు చిగురించాయి. ఎలాగైనా స్వస్థలానికి చేరుకోవాలని ఆరాటపడుతున్నారు.

విశాఖలోని హెచ్‌పీసీఎల్‌, ఎల్‌అండ్‌టీ కంపెనీల్లో పనిచేస్తున్న వందలాది మంది కూలీలు స్వరాష్ట్రాలకు పంపాలంటూ గాజువాకలో రోడ్డెక్కారు. దీంతో గంగవరం పోర్టు రహదారి కార్మికులతో నిండిపోయింది. రెండు నెలలుగా తమకు జీతాలు లేవని, సొంతూర్లకు పంపించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు నచ్చజెప్పేందుకు హార్బర్‌ ఏసీపీ మోహన్‌రావు  గుత్తేదారులతో చర్చలు జరుపుతున్నారు.