https://oktelugu.com/

లాక్ డౌన్ బాధిత ప్రజలపై పెట్రోల్ ధరల మోత

ఒక వంక ప్రజలు కరోనా వైరస్, లాక్ డౌన్ ల కారణంగా ఆదాయాలు కోల్పోయి, ఆర్ధికంగా చితికి పోతూ ఉంటె, మరోవంక ప్రజలపై ప్రభుత్వం నిన్న మద్యం ధరల భారం మోపితే నేడు పెట్రోల్ ధరలను పెంచి వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత పలు సంవత్సరాలుగా అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పడిపోతూ ఉంటే, ముఖ్యంగా రెండేళ్లుగా – తాజాగా లాక్ డౌన్ కారణంగా ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోతూ ఉంటె భారత దేశంలో మాత్రం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 6, 2020 / 05:41 PM IST
    Follow us on


    ఒక వంక ప్రజలు కరోనా వైరస్, లాక్ డౌన్ ల కారణంగా ఆదాయాలు కోల్పోయి, ఆర్ధికంగా చితికి పోతూ ఉంటె, మరోవంక ప్రజలపై ప్రభుత్వం నిన్న మద్యం ధరల భారం మోపితే నేడు పెట్రోల్ ధరలను పెంచి వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

    గత పలు సంవత్సరాలుగా అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పడిపోతూ ఉంటే, ముఖ్యంగా రెండేళ్లుగా – తాజాగా లాక్ డౌన్ కారణంగా ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోతూ ఉంటె భారత దేశంలో మాత్రం ఆ ప్రయోజనాలు ప్రజలకు చేరకంగా ప్రభుత్వాలు తమ ఖజానా నింపుకొని ప్రయత్నం చేస్తున్నాయి.

    వలస కూలీల రైళ్లను రద్దు చేసిన బీజేపీ సర్కార్!

    కేంద్ర ప్రభుత్వం భారీగా నిన్ననే సుంకాలు పెంచి, ఆ మొత్తాలను ఆయిల్ కంపెనీలు తమ లాభాలలో భరించాలని చెబుతూ ఉంటె ఇప్పుడు పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు తీవ్రంగా పెంచాయి. ఇంతకు ముందే మరి కొన్ని ప్రభుత్వాలు పంపాయి.

    ఈ కోవలో ఇప్పటికే వ్యాట్ పెంపుతో ఢిల్లీ పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా పెంచి వాహనదారులకు షాకిచ్చింది. తాజాగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఇంధన ధరలను పెంచేశాయి. పంజాబ్ ప్రభుత్వం వ్యాట్ ధర పెంచడంతో
    రిటైల్ ధరలు రూ .2 చొప్పున పెరుగనున్నాయి.

    ఉద్యోగాలు పోతాయని 86 శాతం భారతీయుల భయం!

    డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) 11.80 శాతం నుంచి 15.15 శాతానికి, పెట్రోల్‌ పై 20.11 శాతం నుంచి 23.30 శాతానికి పెంచినట్లు పంజాబ్ అధికారి తెలిపారు. ఈ అర్థరాత్రి నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ రిటైల్ రేటు లీటరుకు రూ .70.38 నుండి 72.43 కు పెరుగుతుంది, డీజిల్ రేటు లీటరుకు 62.02 నుండి 64.06 రూపాయలకు పెరగనుంది.

    మరోవైపు ఈ నిర్ణయంపై పంజాబ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. పెట్రోలియం డీలర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇంధన అక్రమ రవాణాను ప్రోత్సహిస్తుందని అసోసియేషన్ ప్రతినిధి అశ్విందర్ మొంగియా ఆరోపించారు.

    జర్నలిస్టుల సమస్య.. కేసీఆర్ కు నిజంగా తెలియదా?

    వ్యాట్ పెరిగిన తరువాత, చండీగడ్ తో పోలిస్తే పంజాబ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు వరుసగా రూ.6.61, రూ .4.86 ఎక్కువ పెరగనున్నాయి. చండీగఢ్ లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.65.82, రూ .59.30 గా ఉన్నాయి. లక్నోలో ప్రస్తుత ధర పెట్రోలు లీటరుకు రూ. 71.92 గాను, డీజిల్ ధర రూ. 62.87 గా వుంది.

    ఇక ఉత్తరప్రదేశ్ లో కూడా పెట్రోలు ధరలు మోత మోగనున్నాయి. పెట్రోలు ధర రూ. 2 లు, డీజిల్ పై రూ .1 చొప్పున పెరగనుంది. వ్యాట్ పెంపుతో సవరించిన ధరలు ఈ రోజు (బుధవారం) అర్ధరాత్రి నుండి వర్తిస్తాయని ఉత్తరప్రదేశ్‌ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా వెల్లడించారు.