హాట్ బ్యూటీకి పోలీస్ క్యారెక్టర్ !

సౌత్ హాట్ బ్యూటీస్ లిస్ట్ లో ‘శ్రద్దా దాస్’ అనే పేరు కచ్చితంగా ఉంటుంది. కానీ సినిమాల్లోనే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఏం.. ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ తో కనిపించే శ్రద్ధా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నిజానికి అమ్మడుకి పెద్దగా నటన రాకపోయినా… అందాలను పదర్శించడంలో ఆరితేరి ముదిరిపోయిందనే చెప్పాలి. బికిని వేసినా హాఫ్ సారీ కట్టినా ఈ హాట్ బ్యూటీ అందాల దెబ్బకు కుర్రకారు నిద్ర కూడా పోరు. పైగా […]

Written By: Neelambaram, Updated On : July 24, 2020 10:04 pm
Follow us on

సౌత్ హాట్ బ్యూటీస్ లిస్ట్ లో ‘శ్రద్దా దాస్’ అనే పేరు కచ్చితంగా ఉంటుంది. కానీ సినిమాల్లోనే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఏం.. ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ తో కనిపించే శ్రద్ధా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నిజానికి అమ్మడుకి పెద్దగా నటన రాకపోయినా… అందాలను పదర్శించడంలో ఆరితేరి ముదిరిపోయిందనే చెప్పాలి. బికిని వేసినా హాఫ్ సారీ కట్టినా ఈ హాట్ బ్యూటీ అందాల దెబ్బకు కుర్రకారు నిద్ర కూడా పోరు. పైగా ఫుల్ గా రెచ్చగొట్టే చూపులు, పైగా దానికి మించిన సొగసులతో అందాలతో కనువిందు చేస్తోంది. పాపం ఎంత చేసినా సాధించింది ఏమి లేదాయే. ‘ఆర్య 2, డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ లాంటి హిట్ చిత్రాల్లో మంచి రోల్స్ చేసినా హీరోయిన్ అనే బ్రాండ్ తెచ్చుకోలేకపోయింది.

Also Read: ‘రొమాంటిక్’ బ్యూటీ‌తో నాగశౌర్య రొమాన్స్‌!

కనీసం హిట్ బ్యూటీగా స్టార్ డమ్ ను సంపాదించలేక చిన్నాచితకా రోల్స్ కు పరిమితం అయింది. మన డైరెక్టర్స్ చూపు ఈ బ్యూటీ మీద ఎప్పుడు పడుతుందో గాని, ఇప్పటికీ తెలుగులో బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది ఈ భామ. అందుకే రెచ్చగొట్టే బోల్డ్ పాత్రలో నటించి అదృష్టాన్ని పరీక్షించుకుంటానని అంటుంది. కానీ బ్యూటీకి మాత్రం ఒక పోలీస్ క్యారెక్టర్ దొరికింది. ప్రముఖ కొరియోగ్రఫర విద్యాసాగర్ దర్శకుడిగా జగపతిబాబు ప్రధాన పాత్రగా వస్తోన్న ఓ సినిమాలో శ్రద్దా దాస్ లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. కథ ప్రకారం ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ‘శ్రద్దా దాస్’ పాత్ర బాగా కీలకంగా ఉంటుందట. చాన్నాళ్ల తర్వాత శ్రద్దా దాస్ పూర్తి స్థాయిలో నటిస్తోన్న సినిమా ఇది. మరి ఈ సినిమాతో అయినా ఈ బ్యూటీకి హిట్ వచ్చి డబ్బులు చేసుకోవాలని కోరుకుందాం. అయితే తానూ హీరోయిన్ గా ఎప్పటికీ సక్సెస్ కాకపోయినా.. హాట్ ఫోటో షూట్స్ తోనే మ్యానేజ్ చేసుకుంటానని తన సన్నిహితులతో చెబుతుందట.

Also Read: హిట్ లేకపోయినా ఎమ్మెల్యే కూతుర్ని పట్టాడు !