ఏపీలో 87 చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 87కి చేరాయని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో ప్రభుత్వం వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలను మరింత బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు సీఎం క్యాంపు కార్యాలయంలో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఢిల్లీలో […]

Written By: Neelambaram, Updated On : April 1, 2020 2:19 pm
Follow us on

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 87కి చేరాయని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో ప్రభుత్వం వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలను మరింత బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు సీఎం క్యాంపు కార్యాలయంలో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వారు, వారి కుటుంబ సభ్యులు అధికంగా ఉన్నారు. గడిచిన 12 గంటల్లో మొత్తం 373 శాపిళ్లను పరీక్షించగా 43 పాజిటివ్‌గా, 330 నెగిటివ్‌గా నమోదయ్యాయి. ఈ ఒక్క రోజే తొలిసారిగా కడప జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, కృష్ణ 1, విశాఖ జిల్లాలో 1 కొత్త కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఇద్దరు కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు.