కరోనా కల్లోలం : దేశంలో చేయిదాటిపోతోందా?

సువిశాల భారతం.. 130 కోట్ల మంది ప్రజలు.. ఇంతటి భారీ జనాభాలో ఒక అంటు వ్యాధి.. వేగంగా ప్రబలుతోంది. రోజుకు 3 లక్షలకు పైగా కేసులు.. 2వేలకు పైగా మరణాలు.. ఇవీ అధికారిక లెక్కలు. అనధికారికంగా ఇంకా డబులు, త్రిబుల్.. దేశంలో కరోనా చేయిదాటిపోతోనున్నట్టే పరిస్థితులు అదుపుతున్నాయి. నిన్న సుప్రీంకోర్టు స్వయంగా సుమోటాగా కేసు స్వీకరించి ‘జాతీయ ఎమెర్జెన్సీ’గా పరిస్థితులున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశ ప్రజలకు ఇలాంటి సంక్షోభ సమయంలో కనీస ప్రభుత్వ మద్దతు లభించడం […]

Written By: NARESH, Updated On : April 23, 2021 9:42 am
Follow us on

సువిశాల భారతం.. 130 కోట్ల మంది ప్రజలు.. ఇంతటి భారీ జనాభాలో ఒక అంటు వ్యాధి.. వేగంగా ప్రబలుతోంది. రోజుకు 3 లక్షలకు పైగా కేసులు.. 2వేలకు పైగా మరణాలు.. ఇవీ అధికారిక లెక్కలు. అనధికారికంగా ఇంకా డబులు, త్రిబుల్.. దేశంలో కరోనా చేయిదాటిపోతోనున్నట్టే పరిస్థితులు అదుపుతున్నాయి.

నిన్న సుప్రీంకోర్టు స్వయంగా సుమోటాగా కేసు స్వీకరించి ‘జాతీయ ఎమెర్జెన్సీ’గా పరిస్థితులున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశ ప్రజలకు ఇలాంటి సంక్షోభ సమయంలో కనీస ప్రభుత్వ మద్దతు లభించడం లేదన్న ఆరోపణ ఉంది. ఆస్పత్రిలో బెడ్ దొరకడం లేదు. ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ కొరత.. చివరకు ప్రాణాలు నిలబెట్టుకునే టీకాల కొరత కూడా.. ప్రస్తుతం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఎవరి ఖర్మకు వారు చనిపోవడమో.. అప్పుల పాలు కావడమో జరుగుతోంది.

ప్రజల సొమ్ముతో కట్టిన ప్రభుత్వ ఆస్పత్రులు, అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఇప్పుడు ప్రజలకు సరిపోడం లేదు. సరిగ్గా చికిత్స అందించడం లేదన్న విమర్శ ఉంది. డబ్బులతో ప్రైవేటులో కొందామన్న కనీసం బెడ్స్ దొరకడం లేదు. అంతలా జనానికి కరోనా వ్యాపించింది. దేశంలో వైరస్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ప్రాంతాలకు విస్తరించింది. గాలి ద్వారా సంక్రమిస్తోంది. దేశంలో పాజిటివిటీ రేటు ఏకంగా 50శాతానికి పైగా ఉందట.. దేశ జనాభాలో సగం మందికి కరోనా సోకేలా విస్తరించి ప్రమాద ఘంటికలు మోగించేలా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

నిజానికి గత సంవత్సరం వచ్చిన కరోనాను కేంద్రం లైట్ తీసుకుంది. మేం జయించామని.. కరోనాకు టీకా తెచ్చామని గొప్పలకు పోయింది. కానీ ఆ టీకాను సద్వినియోగం చేసుకోకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ విదేశాలకు తమ పరపతి కోసం పంచిందనే అపవాదు మూటగట్టుకుంది. కరోనా వైరస్ ను అరికట్టామని కేంద్రం బీరాలకు పోయింది. ప్రపంచానికే ఆదర్శమన్నారు. కానీ ఇప్పుడు జరిగింది చూసి కేంద్రంలోని మోడీ సర్కార్ తప్పులు చాలా ఉన్నాయని అర్థమవుతోంది.

వైరస్ సెకండ్ వేవ్ తో ప్రపంచదేశాలన్నీ అల్లాడుతుంటే పట్టించుకోకుండా చోద్యం చూసిన మోడీ సర్కార్ ఇప్పుడు అనుభవిస్తోందని.. వారి నిర్లక్ష్యానికి ప్రజలు కూడా తోడై ఈ ఉపద్రవం వచ్చిందంటున్నారు.. తప్పు ఎక్కడ జరిగిందో కూడా గుర్తించకుండా వ్యవహరిస్తున్నారంటున్నారు. దాని ఫలితమే ఈ దారుణ స్థితి.

దేశంలో పెను ప్రళయంలా విరుచుకుపడుతున్న ఈ వైరస్ వల్ల ఇప్పుడు శ్మశానాలు శవాలతో నిండిపోతున్న పరిస్థితి. కాల్చడానికి సరిపడా స్థలాలు లేక క్యూలో మగ్గాల్సిన దుస్థితి. ఆస్పత్రుల్లో, శ్మశానాల్లో ఖాళీలేని దుస్థితికి దిగజారామంటే దేశంలో పరిస్థితులు చేయిదాటిపోతున్నట్టే లెక్క.