సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండంలోని గుంజలూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్ధానికుల సాయంతో దవాఖానకు తరలించారు. బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు […]
సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండంలోని గుంజలూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్ధానికుల సాయంతో దవాఖానకు తరలించారు. బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.