నేతల గుండెల్లో కరోనా గుబులు..!

తెలంగాణలో కరోనా మహ్మమరి పంజా విసురుతోంది. గడిచిన పదిరోజులుగా తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన తొలినాళ్లలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో కరోనా కేసులు అదుపులోనే ఉండేవి. అయితే ఇటీవల లాక్డౌన్లో భారీ సడలింపులు ఇవ్వడంతో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గతంలోని కరోనా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా నమోదయ్యేవి. తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. లాక్డౌన్లో […]

Written By: Neelambaram, Updated On : June 18, 2020 8:21 pm
Follow us on


తెలంగాణలో కరోనా మహ్మమరి పంజా విసురుతోంది. గడిచిన పదిరోజులుగా తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన తొలినాళ్లలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో కరోనా కేసులు అదుపులోనే ఉండేవి. అయితే ఇటీవల లాక్డౌన్లో భారీ సడలింపులు ఇవ్వడంతో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గతంలోని కరోనా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా నమోదయ్యేవి. తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

లాక్డౌన్లో సడలింపు ఇచ్చాక తెలంగాణలో పలు పార్టీలకు చెందిన నాయకులు పర్యటనలతో హడావుడి చేశారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పలు పనులకు శ్రీకారం చుట్టారు. నేతల రాకతో నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు భారీగా పాల్గొనడంతో సోషల్ డిస్టెన్స్ గాలికొదిలేశారు. దీంతో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ రావడంతో నేతల గుండెల్లో గుబులు పుట్టింది. దీంతో నేతలంతా తమ ఇంటికే పరిమితమవుతోన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లడం లేదు. ఏదైనా పనులు అవసరమైతే ఫోన్లోనే సంప్రదించాలని నేతలు నియోజకవర్గ ప్రజలకు సూచిస్తున్నారని సమాచారం.

లాక్డౌన్ అనంతరం పెద్దసంఖ్యలో వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు కరోనా బారినపడటంతో ఆందోళన నెలకొంది. వీరితోపాటు ప్రజాప్రతినిధులు సైతం ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా ప్రజల్లో తిరగడం వల్లనే వీరికి కరోనా సోకుతుందని తెలుస్తోంది. ఎవరీని నుంచి కరోనా సోకుతుందో తెలియకపోవడంతో నేతలంతా ప్రస్తుతం పర్యటనలకు దూరంగా ఉంటున్నారు.

ఇప్పటికే కొందరు అధికార పార్టీ నేతలు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు నేతలు వైరస్ బారినుంచి త్రుటిలో తప్పించుకొని హోం క్వారంటైన్ కు పరిమితమయ్యారు. తమను ఎవరు నేరుగా కలిసే ప్రయత్నం చేయద్దని నేతలు సూచిస్తున్నారు. కరోనా భయంతో నేతలంతా నేతలంతా ఇంటి నుంచి పనులు చక్కబెడుతుండటం గమనార్హం.