తెలంగాణలో కరోనా కల్లోలం వేళ హైదరాబాద్ లోని ఆస్పత్రులు దోచుకుంటున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యలు, ప్రముఖులు అంతా కరోనా చికిత్సల కోసం హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులపై పడడంతో అవి దోపిడీని మొదలుపెట్టాయని ఆరోపణలున్నాయి.
Also Read: కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి?
ఇటీవలే ఓ వ్యక్తి కరోనాతో చనిపోతే ఏకంగా 17లక్షల బిల్లు వేసింది ఓ ప్రైవేట్ ఆస్పత్రి. ఆ విషయం కేటీఆర్ కు తెలిసి ఆగ్రహం వ్యక్తం చేయడంతో దానిపై కోవిడ్ చికిత్సలకు మాత్రమే నిషేధం విధించి మమ అనిపించారు. నిజానికి ఆ ఆస్పత్రినే సీజ్ చేయాల్సింది.. కానీ అలా జరగలేదు.
వాస్తవానికి చూస్తే ఆ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రినే కాదు.. హైదరాబాద్ లోని చాలా ప్రైవేట్ ఆస్పత్రులు 10లక్షలపైనే కోవిడ్ చికిత్సకు ముక్కుపిండీ మరీ వసూలు చేస్తున్నాయి. ప్రజలు సంపాదించిందంతా ఆస్పత్రులకే తగలేస్తున్న దైన్యం కనిపిస్తోంది.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాత్రం ఆక్సిజన్ లేకుండా రూ10వేలతో ప్రైవేట్ లో చికిత్స అయిపోతుందని చెబుతున్నాడు. కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరితే రూ.5 లక్షలు, రూ.10లక్షలు వసూలు చేస్తున్నారు. బిల్ కట్టకపోతే కనీసం శవాలను కూడా ఇవ్వడం లేదు.
Also Read: బాబుకు టీడీపీ నేతల ‘వెన్నుపోటు’!
ఇటీవలే ఓ బాధితుడు ప్రైవేట్ ఆస్పత్రి అధిక ఫీజులపై హైకోర్టును ఆశ్రయించాడు. లక్షలు కట్టనందుకు చనిపోయిన మృతదేహాన్ని ఇవ్వని ఆస్పత్రిపై మరో బాధితుడు పంజాగుట్ట ఆస్పత్రిని ఆశ్రయించాడు. ఇలా తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల పేరిట దోపిడీ జరుగుతున్నా కేసీఆర్ సర్కార్ చోద్యం చూస్తోందన్న ఆరోపణలున్నాయి.
కానీ ఇంత దారుణంగా పరిస్థితులున్నా కేవలం ఒక ఆస్పత్రిలో కరోనా చికిత్సలకు మాత్రమే నిషేధించారు. తప్పితే ఆస్పత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక మిగతా ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టడం లేదు. సీఎం కేసీఆర్ సార్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతూ ఉన్న ఆస్తిపాస్తులను బిల్లులకే ఖర్చు పెట్టుకుంటున్న దైన్యం కనిపిస్తోందని బాధితులు ఆరోపిస్తు