https://oktelugu.com/

నితిన్‌కు నో చెప్పిన బుట్టబొమ్మ!

టాలీవుడ్‌ ‘బుట్టబుమ్మ’ పూజా హెగ్డే ఇప్పుడు ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. తెలుగులో ఆమెను నెంబర్ వన్‌ హీరోయిన్‌ అనొచ్చు. అన్ని హిట్లు, ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయిప్పుడు. చాలా తక్కువ టైమ్‌లో తెలుగు ఇండస్ట్రీలో పూజ క్రేజీ హీరోయిన్‌గా మారింది. లక్కీ హ్యాండ్‌ అనే ముద్ర పడింది. హీరోలు, డైరెక్టర్ల పాలిట అదృష్ట దేవతగా మారింది. దాంతో, పూజను తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవాలని చాలా మంది చూస్తున్నారు. ఆమె డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. స్టార్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 4, 2020 / 06:34 PM IST
    Follow us on


    టాలీవుడ్‌ ‘బుట్టబుమ్మ’ పూజా హెగ్డే ఇప్పుడు ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. తెలుగులో ఆమెను నెంబర్ వన్‌ హీరోయిన్‌ అనొచ్చు. అన్ని హిట్లు, ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయిప్పుడు. చాలా తక్కువ టైమ్‌లో తెలుగు ఇండస్ట్రీలో పూజ క్రేజీ హీరోయిన్‌గా మారింది. లక్కీ హ్యాండ్‌ అనే ముద్ర పడింది. హీరోలు, డైరెక్టర్ల పాలిట అదృష్ట దేవతగా మారింది. దాంతో, పూజను తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవాలని చాలా మంది చూస్తున్నారు. ఆమె డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్‌ను బట్టి తమ డేట్స్‌ను అడ్జస్ట్‌ చేసుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు.

    Also Read: బాలయ్యా.. హీరోయిన్ల పై ఇష్టాన్ని మానుకో !

    రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో’ భారీ హిట్‌ కావడంతో పూజ స్టార్డమ్‌ అమాంతం పెరిగింది. అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’లో నటిస్తున్న పూజా.. ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’లో హీరోయిన్‌ కూడా. అలవైకుంఠపురములో కంటే ముందే ఈ రెండు సినిమాలకు ఆమె ఓకే చెప్పింది. ‘రాధేశ్యామ్‌’పై దేశం మొత్తం దృష్టి ఉండడంతో పాటు భారీ అంచనాలు ఏర్పడడంతో దానిపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది పూజ. దాంతో, తదుపరి సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. కేవలం కథ నచ్చితే కాదు స్టార్ హీరోలు , పెద్ద బడ్జెట్‌ ఉండాలన్న లెక్కులు కూడా వేసుకోంటోందట. అందుకే చిన్న హీరోలు, ఓ మాదిరి స్టార్లతో మూవీస్‌ అంటే అస్సలు లెక్క చేయడం లేదట.

    Also Read: నిన్ను పెట్టుకుందే అలా కనిపించడానికే !

    ఈ క్రమంలో యువ కథానాయకుడు నితిన్‌ ఆమె షాకిచ్చింది. అతని సినిమాలో నటించేందుకు అస్సలు ఒప్పుకోలేదట. ‘భీష్మ’ హిట్‌తో జోరు మీదున్న నితిన్‌ ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా మారాడు. రీసెంట్‌గా పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడైన అతను ప్రస్తుతం ‘రంగ్‌దే’ మూవీతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు మరో రెండు సినిమాలకు కూడా కమిట్మెంట్‌ ఇచ్చాడు. అందులో హిందీలో సూపర్ హిట్‌ అయిన ‘అంధాదున్‌’ రీమేక్‌. ఆయుష్మాన్‌ ఖురానా, రాధాకా ఆప్టే, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దీన్ని తెలుగులో రీమేక్‌ చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా నటించమని చిత్ర బృందం పూజా హెగ్డేను సంప్రదించారట. కానీ, తాను నటించనని వాళ్ల మొహం మీదే చెప్పేసిందట పూజ. మాతృకలో హీరోయిన్‌ పాత్ర నిడివి తక్కువ కావడం, తాను అడిగినంత రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు చిత్ర బృందం సిద్ధంగా లేకపోవవడంతోనే బుట్టబొమ్మ ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పిందని అంటున్నారు. కానీ, స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల నుంచి కాల్స్‌ వస్తుండడంతోనే రిజెక్ట్‌ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.