https://oktelugu.com/

మూడు రాజధానులపై హైకోర్టు స్టే.. జగన్ సర్కార్ కు షాక్..!

ఏపీలో ఇప్పుడు ఎక్కడా చూసిన మూడు రాజధానుల అంశం గురించే వాడివేడిగా చర్చ నడుస్తోంది. కరోనా సమయంలో ఏపీలో రాజకీయాలు జోరుగా సాగుతోన్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటలయుద్ధంగా కొనసాగుతోంది. సీఆర్డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వీలైనంత తర్వాత రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అయితే తాజాగా జగన్ సర్కార్ స్పీడుకు హైకోర్టు బ్రేక్ వేయడం […]

Written By:
  • NARESH
  • , Updated On : August 4, 2020 / 07:40 PM IST
    Follow us on


    ఏపీలో ఇప్పుడు ఎక్కడా చూసిన మూడు రాజధానుల అంశం గురించే వాడివేడిగా చర్చ నడుస్తోంది. కరోనా సమయంలో ఏపీలో రాజకీయాలు జోరుగా సాగుతోన్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటలయుద్ధంగా కొనసాగుతోంది. సీఆర్డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వీలైనంత తర్వాత రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అయితే తాజాగా జగన్ సర్కార్ స్పీడుకు హైకోర్టు బ్రేక్ వేయడం ఆసక్తికరంగా మారింది.

    Also Read: బీటెక్ రవి రాజీనామా వెనుక అసలు కారణం ఇదేనా?

    జగన్ సర్కార్ తీసుకున్న వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపడంపై అమరావతి ప్రాంతవాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అమరావతి నుంచి రాజధానిని ప్రభుత్వం విశాఖ తరలించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మూడు రాజధానుల బిల్లుపై ఈనెల 14వరకు తాత్కాలికంగా స్టే విధించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది

    దీంతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు పది రోజుల గడువు కావాలని ప్రభుత్వ తరుపు లాయర్లు అడిగినట్లు సమాచారం. మూడు రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం కూడా న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా చర్యలు తీసుకుంటోంది. దీంతో వెంటనే కౌంటర్ దాఖలు చేయకుండా పదిరోజుల సమయం అడిగినట్లు సమాచారం. అయితే పిటిషన్ల తరుపున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం మూడు రాజధానుల బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టులో తమ వాదనలు విన్పించారు.

    Also Read: సీఎం జగన్ కు నిమ్మగడ్డ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా?

    వీలైనంత త్వరగా రాజధానిని విశాఖకు తరలించి ఆగస్టు 15న అధికారికంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని జగన్ సర్కార్ భావించింది. ప్రస్తుతం ఈ బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో మరోసారి జగన్ స్పీడుకు హైకోర్టు బ్రేక్ వేసినట్లయింది. ప్రభుత్వం సైతం హైకోర్టులో తమ వాదనలు బలంగా విన్పించేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు మూడు రాజధానుల విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే..!