https://oktelugu.com/

కరోనా ఎఫెక్ట్: కేసీఆర్ ఆదేశాలు బేఖాతార్!

కరోనా మహ్మమరిని కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సెలవులను ప్రకటించడంతోపాటు లాక్డౌన్ చేపట్టిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులంతా రంగంలోకి దిగాలని ఆదేశించారు. ‘ఏ ఊరి సర్పంచ్.. ఆ ఊరికి కథనాయకుడు కావాలని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, ఎంపీపీలు, మిగతా ప్రజాప్రతినిధులు వారి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రంగంలోకి దిగి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. […]

Written By: , Updated On : March 31, 2020 / 02:13 PM IST
Follow us on

కరోనా మహ్మమరిని కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సెలవులను ప్రకటించడంతోపాటు లాక్డౌన్ చేపట్టిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులంతా రంగంలోకి దిగాలని ఆదేశించారు. ‘ఏ ఊరి సర్పంచ్.. ఆ ఊరికి కథనాయకుడు కావాలని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, ఎంపీపీలు, మిగతా ప్రజాప్రతినిధులు వారి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రంగంలోకి దిగి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కొందరు ఒకటి రెండ్రోజులు కరోనా కట్టడికి పనిచేస్తున్నట్లు కన్పించినా.. ఆ తర్వాత ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారిపోయారు.

తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 70కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకట్రోజులు ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కరోనా కట్టడిపై ప్రజల్లో అవగాహన కల్పించినట్లు కన్పించినా ఆ తర్వాత వీరందరూ గ్రౌండ్ లెవల్లో కన్పించడం మానేశారు. కరోనా ఎఫెక్ట్ భయంతోనే వీరందరు ఇళ్లకే పరిమితమయ్యారా? లేక కేసీఆర్ ఆదేశాలను పాటించడం ఇష్టం లేక గ్రౌండ్ లెవల్లో కనిపించడం లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

గ్రామాల్లో మాత్రం కరోనా కట్టడికి ప్రజాప్రతినిధులు కథానాయకుల్లా వ్యవహరిస్తున్నా.. పట్టణాల్లో మాత్రం కథనాయకులు ఎక్కడ కనిపించకపోవడం శోచనీయంగా మారింది. అయితే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం కరోనా కట్టడికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. వీరిలో ప్రముఖంగా సిద్ధిపేట ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి హరీష్ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ పేర్లు విన్పిస్తున్నారు. వీరంతా ఆయా నియోజవర్గాల్లోని ప్రజలకు అవసరమయ్యే అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా మహమ్మరిపై అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు చేపతున్నారు.

ఇక కేటీఆర్ ఎప్పటికప్పుడు తన ట్వీటర్లో కరోనాపై ట్వీట్లు పెడుతూ ప్రజలను అప్రతమత్తం చేస్తున్నారు. హరీష్ రావు నియోజవర్గంలోనే ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా కట్టడికి వైద్యాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తీరిక లేకుండా కరోనా కట్టడికి పోరాడుతున్నారు. వీరితోపాటు కొందరు మాత్రమే అక్కడక్కడ గ్రౌండ్లో లెవల్లో కరోనా కట్టడికి కథానాయకుల్లా వ్యవహరిస్తున్నారు. కాగా మెజార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం ఇళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఇళ్లకే పరిమితమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేసీఆర్ ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే..