https://oktelugu.com/

కరోనా కలకలం.. ఏపీ షట్ డౌన్!

కరోనా వైరస్ ప్రభావంతో మొన్నటి నుంచి తెలంగాణ షట్ డౌన్ అయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ని కూడా షట్ డౌన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏపీలోని అన్ని విద్యాసంస్థలకు రేపటి నుండి సెలవులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. దీంతో అప్రమత్తమైన జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ని నియంత్రిచడానికి ఇప్పటికే తగిన చర్యలు […]

Written By: , Updated On : March 18, 2020 / 06:24 PM IST
Follow us on

కరోనా వైరస్ ప్రభావంతో మొన్నటి నుంచి తెలంగాణ షట్ డౌన్ అయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ని కూడా షట్ డౌన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏపీలోని అన్ని విద్యాసంస్థలకు రేపటి నుండి సెలవులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. దీంతో అప్రమత్తమైన జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ ని నియంత్రిచడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించిన జగన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. జగన్ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న పీవీ రమేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లతో సహా అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్టు చెప్పారు. అయితే, ఎప్పటి వరకు అనే విషయాన్ని మాత్రం అందులో పేర్కొనలేదు. అయితే, 10వ తరగతి పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి రోజులు గడుస్తున్నా కూడా – కరోనా కి మందు కనిపెట్టలేదు. దీనితో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పెద్ద మొత్తంలో ఒక చోట ప్రజలు గుమ్మిగూడకుండా చూస్తున్నారు. ఈ కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలు యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్ల కు సెలవులు ప్రకటించి ఆయా రాష్ట్రాలను షట్ డౌన్ చేశాయి. అందులో తెలంగాణ గోవా – రాజస్థాన్ – బీహార్ – పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటకలో మార్చి 31 వరకు మాల్స్ – ధియేటర్లు బంద్ చేశారు.పెళ్లిళ్లు – పబ్లిక్ ఫంక్షన్లు కూడా నిర్వహించవద్దని సూచించారు.

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 148 కేసులు నమోదు కాగా అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.