భారత్ లో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తిచెందుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 148 కి చేరుకుంది. ఇందులో 123 మంది భారతీయులు కాగా 25 మంది విదేశీయులు ఉన్నారు. ఇక దీని భారిన పడి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇదిఇలా ఉండగా గత కొంతకాలం నుండి చికెన్ తింటే కరోనా వైరస్ వస్తునదని ప్రచారం జరుగుతుంది… ఈ వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా చక్కర్లు కొట్టడంతో 200 రూపాయలకు పైగా ఉన్న చికెన్ ధరలు ఒక్కసారిగా 30 రూపాయలకు పడిపోయాయి. కొన్ని చోట్ల ఆశ్చర్యంగా ఉచితంగా కోళ్లను పంపిణి చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే మేళాలు పెడుతూ చికెన్ తింటే కరోనా రాదు అని ప్రచారం చేస్తున్నారు.
కానీ ప్రజలు మాత్రం చికెన్ షాప్ ల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీనితో తమిళనాడు పౌల్ట్రీ యజమాని ముత్తుస్వామి ఓపెన్ ఆఫర్ ఇస్తూ చికెన్ తినడం వలన కరోనా వైరస్ వస్తుందని నిరూపించిన వారికి కోటి రూపాయలు ఇస్తానని ఓపెన్ ఆఫర్ ప్రకటించడం జరిగింది. ముత్తుస్వామి కూడా ఎప్పటి నుంచో పౌల్ట్రీ వ్యాపారంలో ఉండటంతో ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడటంతో ఈ ఆఫర్ ప్రకటించాడట. ఒకవైపున చికెన్ ధరలు విపరీతంగా పడిపోతుంటే మటన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనితో సోషల్ మీడియాలో కొంతమంది మటన్ రేట్లను తగ్గించడానికి మటన్ తిన్నా కరోనా వైరస్ సోకుతుందని ప్రచారం చేస్తున్నారు . ఇలా సోషల్ మీడియాలో వచ్చే వార్తల వలన అన్ని రంగాల వ్యాపారులకు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు.