https://oktelugu.com/

కరోనా వేళ ‘ఇ-కామర్స్ ’పండుగ..ఇండియాలో ఇన్ని కోట్ల బిజినెస్?

కరోనా కాలం.. బయటకు వెళ్లాలంటే భయం.. షాపులన్నీ చుట్టి.. .జనాలతో మెదిలి.. ఎందుకు అనవసరంగా కరోనాను ఇంటికి తెచ్చుకోవడం.. అనుకున్నారు చాలామంది.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా.. లాంటి ఇ–కామర్స్ సైట్లు ఉన్నాయి కదా.. అనవసర రిస్క్ ఎందుకని.. ఆన్ లైన్ ఆర్డర్ లపై నే ఎక్కువగా ఆధార పడ్డారు. కరోనా మొదట్లోనూ, ఇప్పుడు పండుగ సీజన్ లోనూ ఇ–కామర్స్ సైట్లు దుమ్మురేపుతున్నాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఫాస్ట్ డెలివరీలు ఇస్తూ కాసుల పంట పండించుకుంటున్నాయి. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 07:10 PM IST
    Follow us on

    కరోనా కాలం.. బయటకు వెళ్లాలంటే భయం.. షాపులన్నీ చుట్టి.. .జనాలతో మెదిలి.. ఎందుకు అనవసరంగా కరోనాను ఇంటికి తెచ్చుకోవడం.. అనుకున్నారు చాలామంది.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా.. లాంటి ఇ–కామర్స్ సైట్లు ఉన్నాయి కదా.. అనవసర రిస్క్ ఎందుకని.. ఆన్ లైన్ ఆర్డర్ లపై నే ఎక్కువగా ఆధార పడ్డారు. కరోనా మొదట్లోనూ, ఇప్పుడు పండుగ సీజన్ లోనూ ఇ–కామర్స్ సైట్లు దుమ్మురేపుతున్నాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఫాస్ట్ డెలివరీలు ఇస్తూ కాసుల పంట పండించుకుంటున్నాయి.

    Also Read: కాంగ్రెస్‌కు సోనియా రిపేర్‌.. టీపీసీసీ రేవంత్ రెడ్డికే?‌

    పండుగ సీజన్ కావడంతో ఇ-కామర్స్ సైట్లు ఈ అవకాశాన్ని పుష్కలంగా ఉపయోగించుకుంటున్నాయి. స్పెషల్ ఆఫర్లు పెట్టి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. పోటాపోటీ ఆఫర్లతో వేల కోట్లు ఆర్జిస్తున్నట్లు మార్కెట్ గణంకాలు చెబుతున్నాయి. అమెజాన్–ఫ్లిప్ కార్ట్లు దసరా, దీపావళి సీజన్లలో ఏకంగా కోటిన్నర స్మార్ట్ ఫోన్ యూనిట్లు అమ్ముడవుతున్నట్టుగా అంచనా! ఈ ఏడాది చివరకు మొత్తంగా 5 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతాయని భావిస్తున్నారు. జనాలకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఓ నిత్యావసరంగా పరిణమించడంతో కరోనా టైంలో కాస్త సేల్స్ తగ్గినా.. పండుగ సీజన్లో సేల్స్ ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు.

    ఇ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్లు తమ ఆఫర్ల ఐదు రోజుల్లోనే ఏకంగా 22 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేశాయట. దసరా, దీపావళి పండుగలు పూర్తయ్యే సరికి మరింత భారీ వ్యాపారం జరుగుతుందని అంచనా. గతేడాది ఈ సీజన్ మొత్తానికి 28వేల కోట్ల రూపాయల స్థాయి బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈసారి ఆ వ్యాపార మొత్తం 50వేల కోట్ల రూపాయల పైస్థాయికి చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి.

    Also Read: బీజేపీ వరం: ఎన్డీయే అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌

    కరోనా వేళ ప్రజల కొనుగోలు సామర్థ్యం కొంత తగ్గినట్టుగా కన్పిస్తున్నా.. ఆ ప్రభావం ఈ వ్యాపారాలపై పెద్దగా పడినట్టు లేదు. ఇ-కామర్స్ సైట్లు చిన్న చిన్న పట్టణాలకు కూడా తమ డెలివరీ వ్యవస్థను విస్తరించాయి. ఈ నేపథ్యంలో వాటి వ్యాపారాలు కూడా మరింత విస్తృతంగా వ్యాపించి.. కోట్ల వర్షం కురిపిస్తున్నాయి.