https://oktelugu.com/

చంద్రబాబుకు షాకిచ్చిన జగన్ సర్కార్.. ఇంటిని ఖాళీ చేయాల్సిందే!

భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నదికి భారీ ఎత్తున వరద ప్రవాహం చేరుకుంది. భారీ వర్షాలు, వరదలతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 2.50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. అది 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. Also Read: కరోనా మృతులకు రూ.5 లక్షలు.. జగన్‌ వరం.. కేసీఆర్ కరుణించవా? ఈ క్రమంలోనే కృష్ణా నది కరకట్టపై ఉన్న నిర్మాణాలను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 / 06:08 PM IST
    Follow us on

    భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నదికి భారీ ఎత్తున వరద ప్రవాహం చేరుకుంది. భారీ వర్షాలు, వరదలతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 2.50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. అది 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

    Also Read: కరోనా మృతులకు రూ.5 లక్షలు.. జగన్‌ వరం.. కేసీఆర్ కరుణించవా?

    ఈ క్రమంలోనే కృష్ణా నది కరకట్టపై ఉన్న నిర్మాణాలను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా అధికారులు తేల్చి చెప్పారు. ఇంటికి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇంటికి మరోసారి జగన్ సర్కార్ నోటీసులు జారీ చేసింది. కృష్ణా నది కరకట్ట లోపల వైపు ఉండే నివాసాలకు వైసీపీ ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి సైతం అధికారులు స్వయంగా వెళ్లి నోటీసులు ఇచ్చారు.

    కృష్ణానది ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా కరకట్టపై ఉన్న ఆయన నివాసంతో పాటు మరో 36 ఇళ్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడున్న వారంతా ఇళ్లను ఖాళీ చేయాలని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. గతంలోనూ కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో చంద్రబాబు ఇంటికి నోటీసులు అంటించారు. ప్రస్తుతం కృష్ణానదిలో 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉన్నందున ఈ నోటీసులు పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కాగా ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం పెరుగతోంది.

    Also Read: రైతు కన్నెర్ర చేస్తే.. ప్రభుత్వాలకు ఏ గతిపడుతుంది?

    గత సెప్టెంబర్ లోనూ చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇచ్చారు. గత ఏడాది కూడా భారీ వర్షాలు కురవడంతో ఈ నోటీసులు పంపారు. ఇది అప్పట్లో రాజకీయ దుమారం రేపింది. ఈ తరుణంలో మరోసారి చంద్రబాబు ఇంటికి జగన్ సర్కార్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.