మహమ్మారికి వెయ్యిమంది బలి!

దేశంలో కోవిడ్ -19 కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటగా, కేసుల సంఖ్య 31,332 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ సోకడం వల్ల చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 22,629 కాగా, 7,695 మంది కోలుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం సాయంత్రం నుంచి మొత్తం 70 మరణాలు సంభవించాయి. దింతో కరోనా భారిన పడి మరణించిన వారి సంఖ్య 1007కి చేరింది. వీటిలో 31 మరణాలు మహారాష్ట్ర నుండి, […]

Written By: Neelambaram, Updated On : April 29, 2020 12:11 pm
Follow us on

దేశంలో కోవిడ్ -19 కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటగా, కేసుల సంఖ్య 31,332 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ సోకడం వల్ల చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 22,629 కాగా, 7,695 మంది కోలుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

మంగళవారం సాయంత్రం నుంచి మొత్తం 70 మరణాలు సంభవించాయి. దింతో కరోనా భారిన పడి మరణించిన వారి సంఖ్య 1007కి చేరింది. వీటిలో 31 మరణాలు మహారాష్ట్ర నుండి, 19 గుజరాత్ నుండి, ఏడు మధ్యస్థాదేశ్, రాజస్థాన్ నుండి ఐదు, ఉత్తర ప్రదేశ్ నుండి మూడు, పశ్చిమ బెంగాల్ నుండి రెండు మరియు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ నుండి ఒక్కొక్కరు మరణించారు.

1,007 మంది మరణాలలో 400 మంది మరణాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, గుజరాత్ 181 వద్ద, మధ్యప్రదేశ్ 120, ఢిల్లీ 54, రాజస్థాన్ 51, ఉత్తర ప్రదేశ్ 34, ఆంధ్రప్రదేశ్ 31 తర్వాత స్థానాలలో ఉన్నాయి.

ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య తెలంగాణలో 26, తమిళనాడులో 25, పశ్చిమ బెంగాల్‌లో 22 కాగా, కర్ణాటకలో 20 మందిగా నమోదయ్యింది. అలాగే పంజాబ్‌లో ఇప్పటివరకు 19 మరణాలు నమోదయ్యాయి. ఈ వ్యాధి వల్ల జమ్మూ కాశ్మీర్‌లో ఎనిమిది, కేరళలో నలుగురు, జార్ఖండ్, హర్యానాలో మూడు మరణాలు నమోదయ్యాయి. బీహార్‌ లో రెండు మరణాలు సంభవించగా, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అస్సాం ఒక్కొక్కటి మరణించినట్లు మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఉదయం అప్‌డేట్ చేసిన గణాంకాల ప్రకారం దేశంలో అత్యధికంగా 9,318 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ 3,744, ఢిల్లీ 3,314, మధ్యప్రదేశ్ 2,387, రాజస్థాన్ 2,364, తమిళనాడు 2,058, ఉత్తర ప్రదేశ్ 2.053, ఆంధ్రప్రదేశ్‌ లో 1,259, తెలంగాణలో 1,004 కేసులకు పెరిగింది. పశ్చిమ బెంగాల్‌ లో 725, జమ్మూ కాశ్మీర్‌లో 565, కర్ణాటకలో 523, కేరళలో 485, బీహార్‌లో 366, పంజాబ్‌ లో 322 కేసుల సంఖ్య పెరిగింది. హర్యానాలో 310 కరోనావైరస్ కేసులు, ఒడిశాలో 118 కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్‌లో మొత్తం 103 మందికి, ఉత్తరాఖండ్‌లో 54 మందికి ఈ వైరస్ సోకింది.

చండీఘర్ లో 56 కేసులు, హిమాచల్ ప్రదేశ్‌ లో 40 కేసులు, అస్సాం, ఛత్తీస్‌గడ్ లో ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. అండమాన్, నికోబార్ దీవుల్లో 33 కోవిడ్ -19 కేసులు ఉండగా, లడఖ్‌ లో ఇప్పటివరకు 22 కేసులు నమోదయ్యాయి. మేఘాలయలో 12 కేసులు, పుదుచ్చేరిలో ఎనిమిది కేసులు, గోవాలో ఏడు కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. మణిపూర్, త్రిపురాల్లో రెండు కేసులు ఉండగా, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌ లో ఒక్కో కేసు నమోదైందని కేంద్ర మంత్రుత్వ శాఖ వెల్లడించింది.