Cordelia Cruise Ship: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి విహార నౌక వచ్చింది. కార్టీలియా క్రూయిజ్ షిప్ రాకతో సముద్రంలో మూడు నాలుగు రోజులు ప్రాయాణించాలనుకుంటున్న విశాఖ ప్రజలతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక నెరవేరింది. రోజులపాటు సముద్రంలో ప్రయాణం చేస్తూ బయటి ప్రపంచానికి దూరంగా ఉండడంతోపాటు, అన్నీ మనచుట్టూనే ఉంటో ఎంతో బాగుంటుంది. దేశంలో కొన్ని ప్రాంతాలకే ఇంటి అవకాశం ఉండగా ఇప్పుడు విశాఖ వాసులకు అందుబాటులోకి వచ్చింది. మరి దీని ప్రత్యేకత ఏమిటి, ఎన్నిక రోజుల ప్రయాణం చేయవచ్చు.. ఎంత ఖర్చువుతుందో తెలుసుకుందాం.

విశాఖవాసులను ఎంతో కాలంగా ఊరిస్తున్న విహార నౌక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. బయటి ప్రపంచంతో సబంధం లేకుండా హాయిగా మూడు నాలుగు రోజులు సముద్రంలో విహరించే అవకాశం రావడంతో యాత్రీకులు సముద్ర యానానికి రెడీ అయ్యారు. ఎంప్రెస్ అనే ఈ నౌక విశాఖ నుంచి పుదుశ్చేరి మీదుగా చెన్నై వరకు వెళ్లి తిరిగి మళ్లీ విశాఖకు వస్తుంది. ఈమేరకు బుధవారం ఈ నౌక ప్రయాణికులతో చెన్నై బయల్దేరింది. రాష్ట్ర పర్యాటక శాఖ మత్రి ఆర్కే. రోజ దీనిని ప్రారంభించారు. ఈ సర్వీసులు జూన్ 15, 22 తేదీల్లో కూడా అందుబాటులో ఉంటాయి.
Also Read: Naga Chaitanya: ఇష్టం లేకపోయినా నాగ చైతన్య తో బలవంతంగా సంతకాలు పెట్టించిన సమంత
విదేశీ విహార నౌక ఇది..
ఎంప్రెస్ విదేశానికి చెందిన విహార నౌక. ప్రస్తుతం ఇది భారత దేశంలో మాత్రమే తిరిగేలా నిర్వాహకులు అనుమతి పొందారు. దీంతో పాస్‌పోర్టు అవసరం లేదు. కస్టమ్స్ తనిఖీలు కూడా ఉండవు. ఈ నౌకలో 11 అంతస్తులు ఉన్నాయి. ఒకేసారి ఇందులో 1,840 మంది ప్రయాణించవచ్చు. ఇందులో ఫుట్‌కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్‌లు, ఐదు బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్‌పూల్, ఫిట్‌నెస్ సెంటర్లు, డీజే ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్ మాల్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్, లైవ్ షోలూ ఉన్నాయి. చిన్నారులకు ప్రత్యేక ఫన్ ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న అందరికీ షిప్‌లోని క్యాషినో వరల్డ్‌లోకి ఉచితంగా ప్రవేశం ఉంటుంది. లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు చార్జీలు వసూలు చేస్తారు.
సముద్రంలో మజా చేయాల్సిందే..
ఇన్ని సదుపాయాలు ఉన్న షిప్‌లో ప్రయాణం చేస్తూ సముద్రంలో మజా చేయకపోతే ఎందుకు అనిపిస్తుంది. మరి ఇందులో ప్రయాణించాలంటే.. స్టే రూం ధర రూ.25 వేలు, సముద్రాన్ని వీక్షించే రూం ధర రూ.30 వేలు, మినీ సూట్ ధర రూ.53,700. ఈ షిప్‌లో అన్ని రూములు కలిసి 796 ఉన్నాయి.
మొదటి సర్వీస్ షురూ..
షిప్ మొదటి సర్వీస్ బుధవారం ప్రారంభమైంది. అందులోని ప్రయాణికులు విశాఖలోనే సాయంత్రం వరకుప్రయాణించారు. గురువారం మొత్తం సముద్రంలోనే ప్రయాణిస్తుంది. 10వ తేదీ ఉదయం 7 గంటల వరకు పుదుచ్చేరి చేరుకుంటుంది. ఆ రోజంతా అక్కడే ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు మళ్లీ బయల్దేరి మరుసటి రోజు చెనై్న చేరుకుంటుంది.

100 కోట్లతో నిర్మాణం..
భారీ విహార నౌకను సుమారు వంద కోట్లతో నిర్మించారు. దీని ప్రయాణం గంటలకు 20 నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. ప్రమాదాల నివారణ, నౌక నడిపే సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, ఇంత సర్వీస్ సిబ్బంది మొత్తం కలిసి సుమారు 500 మంది వరకు ఇందులో ఉంటారు. ఇందులో లభించే మద్యం, భోజనం ధర బయటికంటే ఎక్కువగానే ఉంటుంది. సర్వీస్‌లకు అదనంగా చార్జి చేస్తారు.
ఖరీదైనా.. ఒక్కసారి విహరించాల్సిందే..
ఎంప్రెస్ నౌకలో ప్రయాణం కాస్త ఖరీదే అయినా ఒక్కసారి అయినా ఇందులో ప్రయాణం చేయాల్సిందే. దీనికి పాస్‌పోర్టు అవసరం లేదు. సముద్రం మధ్యలో నాలుగు రోజులు లగ్జరీ లైఫ్ అనుభవించానికి ఒక్కసారైనా ఇలా అలా వెళ్లిరండి. ఈనెల 15, 22వ తేదీల్లోనూ నౌక విశాఖ నుంచి బయల్దేరుతుంది. దీనికోసం బుకింగ్స్ కూడా నడుస్తున్నాయి.
Also Read:Youtube Views Fraud: సినిమా లెక్కలు: వ్యూస్ అన్నీ వాపే.. బలుపనుకుంటే డిజాస్టరే!!
[…] […]
[…] […]