Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya: ఇష్టం లేకపోయినా నాగ చైతన్య తో బలవంతంగా సంతకాలు పెట్టించిన సమంత

Naga Chaitanya: ఇష్టం లేకపోయినా నాగ చైతన్య తో బలవంతంగా సంతకాలు పెట్టించిన సమంత

Naga Chaitanya: సౌత్ ఇండియా లో మోస్ట్ లవ్లీ కపుల్స్ లో ఒక్కరిగా పేరు తెచ్చుకున్న జంట సమంత మరియు నాగ చైతన్య జంట..ఏ మాయ చేసావే సినిమాతో ప్రారంభం అయినా వీళ్లిద్దరి ప్రయాణం స్నేహం గా మారి..ఆ తర్వాత ప్రేమగా పరిణీతి చెంది పెద్దల సమక్షం లో పెళ్లి కూడా చేసుకున్నారు..ఎంతో అన్యోయంగా సుమారు నాలుగేళ్ల పాటు సాగిన ఈ ఇద్దరి దాంపత్య జీవితం కొన్ని అనుకోని కారణాల వల్ల ఏడాది క్రితం విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి మన అందరికి తెలిసిన విషయమే..మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగా అనిపించే ఈ జంట విడిపోవడం ప్రతి ఒక్కరికి ఎంతో బాధని కలగచేసింది..ఎదో ఒక్క అద్భుతం జరిగి మళ్ళీ ఈ ఇద్దరు కలిస్తే బాగుండును అని కోరుకునే అభిమానుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది..ఇది పక్కన పెడితే వీళ్లిద్దరి వైవాహిక జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Naga Chaitanya
Chaitanya, Sam

అక్కినేని కుటుంబం కోసం సమంత ఎన్నో త్యాగాలు చేసింది అని అందరూ అంటూ ఉంటారు..అయితే ఆత్మాభిమానం దగ్గరకి వచ్చేసరికి సర్దుకుపోవడం కుదరక విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది అని ఫిలిం నగర్ లో వినిపించే వార్త..ఇది కాసేపు పక్కన పెడితే సమంత నాగ చైతన్య పట్ల ఎంతో కేర్ తో ఉండేది అట..ముఖ్యంగా తన కెరీర్ కంటే నాగ చైతన్య కెరీర్ బాగుండాలి అని సమంత ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది అట..సినిమాలు ఎంపిక విషయం లో నాగ చైతన్య కి ఎన్నో సలహాలు మరియు సూచనలు ఇస్తూ ఉండేది అట సమంత..అలా ఒక్క వెబ్ సిరీస్ కి నాగ చైతన్య కి ఇష్టం లేకపోయినా కూడా, ఆయనని బలవంతంగా ఒప్పించి సంతకం పెట్టించింది అట..ఆ వెబ్ సిరీస్ పేరే ‘దూత’..అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ హారర్ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.

Naga Chaitanya
Dhoota

Also Read: Jagan On MLAs: వ్యతిరేకత ఎమ్మెల్యేలకు.. అధికారం జగన్ కా?

ఈ వెబ్ సిరీస్ స్టోరీ చెప్పగానే నాగ చైతన్య కి నచినప్పటికీ కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడం తో తొలుత ఈ సిరీస్ లో నటించడానికి ఆయన అంగీకరించలేదు అట..కానీ సమంత ‘నటుడిగా ఎదగాలి అంటే ఇలాంటి విభిన్నమైన పాత్రలు చెయ్యాలి..కథ కూడా అద్భుతంగా ఉంది..ఈ వెబ్ సిరీస్ నువ్వు కచ్చితంగా చేసి తీరాలి’ అంటూ పట్టుబట్టి సంతకం చేయించింది అట సమంత..అలా సమంత చెప్పడం వల్ల నాగ చైతన్య ఒప్పుకున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకుంది..త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది..గతం లో సమంత కూడా ఫామిలీ మ్యాన్ సీసన్ 2 వెబ్ సిరీస్ లో నెగటివ్ క్యారక్టర్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇందులో సమంత నటనకిగాను జాతీయ స్థాయి గుర్తింపు లభించింది..మరి నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ కూడా ఆయనకీ ఆ స్థాయి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతాయో లేదో చూడాలి.

Also Read: NTR Koratala Movie: ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో మరో స్టార్ హీరో

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version