Kajal Aggarwal: సౌత్ ఇండియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒక్కరు కాజల్ అగర్వాల్..ఈమె ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి దశాబ్దం పైనే అయ్యింది..ఇంత గ్యాప్ లో ఏడాది కి ఒక కొత్త హీరోయిన్ ఇండస్ట్రీ లోకి వస్తున్నప్పటికీ కూడా సౌత్ ఇండియా లో కాజల్ అగర్వాల్ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి..తెలుగు , హిందీ , తమిళం అని తేడా లేకుండా అన్ని ప్రాంతీయ బాషలలో స్టార్ హీరోల సరసన నటించి కోట్లాది మంది కుర్రకారుల మనసులను కొల్లగొట్టింది ఈ బ్యూటీ..అయితే 2020 వ సంవత్సరం లో తన ప్రియుడు గౌతమ్ కిచ్లు అనే అతనిని పెళ్ళాడి సినిమాలు చేసే సంఖ్య బాగా తగ్గించేసింది..పెళ్లి తర్వాత ఆమె ఒప్పుకున్న సినిమాలు అన్ని పూర్తి చేసిన తర్వాత సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చి ఒక్క మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..తన కొడుకు తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యగా అవి తెగ వైరల్ గా మారింది.
Also Read: CM Jagan On Meters: ఏపీలో ఉచిత విద్యుత్ ఎత్తేస్తారా? వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు
ఇది ఇలా ఉండగా కొడుకు పుట్టిన తర్వాత తల్లిగా అతని ఆలనా పాలన చూసుకుంటూ బాగా బిజీ అయిన కాజల్ అగ్వర్వాల్ ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది..తాను సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని సంకేతాలు ఇస్తూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తుంది కాజల్ అగర్వాల్..తనకి తగ్గ పాత్రలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తన వ్యక్తిగత మ్యానేజర్లతో ప్రముఖ నిర్మాణ సంస్థలకు మరియు OTT చానెల్స్ కి ఫోన్లు చేయిస్తుంది అట కాజల్..అంత పెద్ద హీరోయిన్ సినిమాల్లో నటించడానికి సిద్ధం గా ఉన్నాను అని ప్రకటించగానే దర్శక నిర్మాతలు క్యూ కట్టాలి కానీ..ఇలా తానే స్వయంగా ఫోన్లు చేయించి అవకాశాల కోసం అడగడం ఏమిటి అని ఆమె అభిమానులు సోషల్ మీడియా లో ఫీల్ అవుతున్నారు..పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ క్రేజ్ బాగా తగ్గిపోయింది అనే సందేహాలు కూడా అభిమానుల్లో నెలకొన్నాయి..కానీ కాజల్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆమె అందం ఏ మాత్రం తరగలేదు అనేది అర్థం అయ్యిపోతుంది..పెళ్లి తర్వాత ఆమె నటించిన ఏకైక సినిమా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య..కథకి కాజల్ అగర్వాల్ పాత్ర అడ్డుగా వస్తుంది అని ఆమె సన్నివేశాలు ఈ చిత్రం నుండి తొలగించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత ఆమెకి ఎలాంటి పాత్రలు వస్తాయో చూడాలి..అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ సినిమాలకంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అట.
Also Read: Balayya with Power Star: ఈసారి పవర్ స్టార్ తో బాలయ్య..ఫాన్స్ కి ఇక పండగే