Hijab Row In AP: కర్ణాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం దేశమంతటా వ్యాపిస్తోంది. ప్రస్తుతం తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో అందరు ఆశ్చర్యపోయారు. ముస్లిం యువతులు బురఖా ధరించి కళాశాలకు రావొద్దని సూచించడంతో వారు ఖంగుతిన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణకు మారుపేరైనా కళాశాలల్లో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో అందరిలో ఆందోళన నెలకొంది.
విజయవాడలోని లయోల కళాశాల ఎప్పుడో స్థాపించింది. ఇందులో చదువుకోవాలని అందరు భావిస్తారు. అంతటి పేరున్న కళాశాలలో చదువుకుని జీవితంలో ఎన్నో మంచి అవకాశాలు సాధించి స్థిరపడిన వారున్నారు. అందుకే ఇందులో చదువుకోవాలని ఉత్సాహం చూపిస్తుంటారు. ఇన్నాళ్లుగా బురఖా ధరించి వచ్చే ముస్లిం యువతులను బురఖా తీసేసి రావాలని సూచించడంతో వారు వారి పెద్దలకు ఫిర్యాదు చేశారు. కళాశాలకు చేరుకున్న పెద్దలు యాజమాన్యం మాటలు విని నోరు వెళ్లబెట్టారు.
Also Read: గౌతమ్ సవాంగ్‌కు కీలక పదవి.. జగన్ అసలు వ్యూహం ఇదే..!
డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నిర్వాకంతోనే ఇలా జరిగిందని గుర్తించి సర్ది చెప్పారు. దీంతో ఎవరో చేసిన దానికి మరెవరో బాధ్యులు కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో లయోల కళాశాల యాజమాన్యం తీరుతో వారిపై పెద్ద మచ్చ పడింది. ఇన్నాళ్లు సామరస్యంగా సాగిన కళాశాలలో ఒక్కసారిగా హిజాబ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన పెరిగింది.
హిజాబ్ లొల్లికి యాజమన్యానికి సంబంధం లేదని తెలిసిపోయింది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. దేశంలో ప్రస్తుతం హిజాబ్ గొడవ చెలరేగుతున్న సందర్భంలో మరోసారి హిజాబ్ వ్యవహారం పెద్ద దుమారం రేపే విదంగా అందరిలో భయాందోళనలు కనిపించినా గొడవ సద్దుమణగడం ఆహ్వానించదగినదే. ఈ క్రమంలో హిజాబ్ లొల్లి ప్రశాంతంగా ముగియడంపై హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: జగన్ కొట్టలేదట.. నమ్మండి అంటున్నాడు..