Homeఎంటర్టైన్మెంట్Trisha Krishnan Controversy: హీరోయిన్ త్రిష పై నోరు జారిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విలన్..వీడియో...

Trisha Krishnan Controversy: హీరోయిన్ త్రిష పై నోరు జారిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విలన్..వీడియో వైరల్!

Trisha Krishnan Controversy: ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha Krishnan) గత కొద్దిరోజుల నుండి తీవ్రమైన విమర్శలను ఎదురుకొంటోంది. సోషల్ మీడియా లో ఆమె పై ఎక్కడ చూసినా ట్రోల్స్ కనిపిస్తున్నాయి. కారణం ఎంతో కాలం నుండి ఆమె తమిళ స్టార్ హీరో విజయ్ తో మైంటైన్ చేస్తూ వచ్చిన సీక్రెట్ రిలేషన్ ని బహిర్గతం చేయడం వల్లే. విజయ్ భార్య సంగీత చెన్నై లోని చెంగలపట్టు ఫ్యామిలీ కోర్టు లో తనకు విడాకులు కావాలంటూ పిటీషన్ వేయడం, అందులో విజయ్ చాలా కాలం నుండి ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే తనకు విడాకులు కావాలని అనడం , ఈ ఘటన జరిగిన రెండు మూడు రోజులకు విజయ్ ఒక ప్రముఖ తమిళ స్టార్ నిర్మాత కొడుకు వివాహానికి త్రిష తో కలిసి హాజరు అవ్వడం వంటివి జరిగింది.

ఈ నేపథ్యం లో త్రిష ని విజయ్ అభిమానులు సోషల్ మీడియా లో ట్యాగ్ చేస్తూ, పచ్చని సంసారం లో నిప్పులు పోసావు కదే అంటూ తిడుతున్నారు. త్రిష పై ఆడియన్స్ లో మొదటి నుండి మంచి అభిప్రాయం ఉండేది. ఈ దెబ్బతో ఆమెపై ఉన్న ఆ అభిప్రాయం మొత్తం మారిపోయినట్టుగా అనిపిస్తోంది. కేవలం జనాల్లోనే కాదు, సినీ నటుల్లో కూడా త్రిష చులకన అయిపోయింది. ప్రముఖ తమిళ సీనియర్ నటుడు ‘పార్థి బన్’ నిన్న ఒక అవార్డు ఫంక్షన్ కి వచ్చాడు. త్రిష కి ఆయన చేతుల మీదుగా అవార్డు ఇవ్వాలి. కానీ త్రిష ఈ ఈవెంట్ రాలేదు. దీంతో ‘పార్థి బన్’ మాట్లాడుతూ ‘ఈ మహాతల్లి ని ఇంట్లో ఉంచడమే మంచిది లే ‘ అంటూ వ్యాఖ్యానించాడు. ఆయన మాట్లాడిన మాటలకు ఆడిటోరియం లో ఉన్న జనాలందరూ నవ్వుకున్నారు. ఇన్నేళ్ల త్రిష సినీ కెరీర్ లో ఇలాంటి అవమానం ఆమెకు ఎప్పుడు ఎదురు అవ్వలేదు.

విజయ్ అందుకే త్రిష తో ఉన్న రిలేషన్ గురించి స్పష్టంగా అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి అని విశ్లేషకులు అనే మాట. ఎందుకంటే వీళ్లిద్దరు తప్పు చేసినట్టు విజయ్ భార్య సంగీత స్పష్టంగా తన పిటీషన్ లో పేర్కొంది. విజయ్ క్లారిటీ ఇవ్వకపోతే అదే నిజం అనుకుంటారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయం లో ఈ రేంజ్ నినాదాలతో పోటీ చేస్తే ఘోరమైన ఫలితాలే వస్తాయి. పొలిటికల్ కెరీర్ ఆరంభం లోనే ముగిసినట్టు అవుతుంది. అంతే కాదు ఒక ఆడపిల్ల కూడా ఆయన కారణంగా దోషిగా జనాల్లో నిలబడాల్సి వస్తుంది. ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరు, పరువు , ప్రఖ్యాతలు మొత్తం కూడా బూడిద లో పోసిన పన్నీరు అవుతుంది. కనీసం రాబోయే రోజుల్లో అయినా దీనిపై విజయ్ క్లారిటీ ఇస్తాడో లేదో చూద్దాం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version