Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అధికార బీఆర్‌ఎస్ హ్యాట్రిక్‌పై కన్నేయగా, విపక్ష కాంగ్రెస్ బీజేపీలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. కర్ణాక ఎన్నికల ఫలితాలతో మంచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్ బీఆర్‌ఎస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తోంది. దీంతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. విపక్ష నేతలను లాక్కుని ఆ పార్టీలను కాస్త వీక్ చేసింది. అలాంటి కేసీఆర్‌కు ఈసారి హస్తం పార్టీ ఊహించని షాక్‌లు ఇస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. మరో వైపు రాష్ట్రస్థాయి పాపులారిటీ ఉన్న గులాబీ నేతలను లాగేందుకు కాంగ్రెస్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. నాలుగైదు రోజుల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ కానున్నది.
పెద్ద లీడర్ల చేరిక పూర్తి..
బీఆర్‌ఎస్ నుంచి పెద్ద లీడర్లను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రక్రియ దాదాపు కంప్లీట్ అయిందని, ఇకపైన ప్రతిరోజూ పదుల సంఖ్యలో నియోజకవర్గస్థాయి లీడర్ల చేరిక కంటిన్యూ అవుతుందని కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పోలింగ్ సమయానికి బీఆర్‌ఎస్ యాక్టివిటీస్‌ను సక్సెస్ చేయడానికి లోకల్ లీడర్లు, కేడర్ తగినంతగా ఉండరని కామెంట్ చేశారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కేసీఆర్ పిలుపునిస్తున్నా దానిపై అభ్యర్థులకూ, స్థానిక పార్టీ లీడర్లకూ సదాభిప్రాయం లేకపోవడంతో ఆ పని అనుకున్నంత స్థాయిలో అమలయ్యే అవకాశాల్లేవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎత్తులను తట్టుకునేలా ఇకపైన బీఆర్‌ఎస్ ఆత్మరక్షణ విధానాలకు పరిమితం కావాల్సి వస్తుందన్నారు.
గ్రామస్థాయి నేతలనూ..
ఇక బీఆర్‌ఎస్‌కు చెందిన గ్రామ స్థాయి లీడర్లు మొదలు మండల, జిల్లాస్థాయి నేతలనూ ఆకర్షించే ప్రయత్నాలను కాంగ్రెస్ మొదలుపెట్టింది. సర్పంచ్ మొదలు మున్సిపల్ మేయర్ వరకు ఒక్కొక్కరిగా అందరినీ గులాబీ పార్టీకి దూరం చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది. రాష్ట్రస్థాయి నేతలను పార్టీలో చేర్చు కోవడం ద్వారా గులాబీ అభ్యర్థుల్లో గందరగోళాన్ని సృష్టించడంతోపాటు కాన్ఫిడెన్స్ లెవెల్‌స తగ్గించగ లిగామని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తోంది. ఇప్పుడు పోల్ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరించే లోకల్ లీడర్లు, కేడర్ను డీమోరల్ చేసే పనిపై ఫోకస్ పెట్టింది. పోలింగ్‌కు ఇంకా నెలకు పైగా టైమ్ ఉండడంతో అప్పటికల్లా బీఆర్‌ఎస్ గ్రౌండ్ ఖాళీ చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో, భాగంగానే అనేక నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్, వైస్ చైర్మన్, చైర్పర్సన్, మేయర్ తదితర స్థాయిల్లోని లీడర్లను ఆకట్టుకునేపనిలో నిమగ్నమైంది హస్తం పార్టీ. జీహెచ్‌ఎంసీ బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్‌గౌడ్ లాంటివారిని సైతం పార్టీలోకి ఆహ్వానించింది. బీఆర్‌ఎస్‌కు రోజుకో షాక్ ఇస్తోంది.
బీఆర్‌ఎస్‌ను బలహీనపర్చడమే..
రాష్ట్రంలో తమ పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నదని, కార్యకర్తలకే పార్టీకి కంచుకోటలా నిలిచే సైన్యమని, వారికి బీమా సౌకర్యం అందిస్తున్న ఏకైక పార్టీ అని బీఆర్‌ఎస్ గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ ఆ పార్టీకి రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవనే ధీమాను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సమయానికి అధికార పార్టీని చుట్టుముట్టేసేలా కాంగ్రెస్ పక్కా స్ట్రాటెజీని రూపొం దించుకున్నదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.. హుజూరాబాద్, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా సొంత పార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా డబ్బులతో బీఆర్‌ఎస్ కాపాడుకున్నదని, కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ ఎత్తులు ఫారవనేది కాంగ్రెస్ నేతల బలమైన వాదన.
టార్గెట్ క్యాడర్…
బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత, సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న చిక్కులు, ప్రజలకు సమాధానం చెప్పుకోలేని నిస్సహాయత, పదేండ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కిందిస్థాయి నేతలకు తగిన అవకాశాలు కల్పించకపోవడం, నియోజకవర్గస్థాయిలో రాజకీయంగా ఎదగ నివ్వకపోవడం.. ఇలాంటివన్నీ ఆ పార్టీ నుంచి నేతలు దూరం కావడానికి కారణమయ్యాయని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఈసారి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారని, అందుకే బీఆర్‌ఎస్‌ను విడిచిపెట్టాలనే నిర్ణయానికి నేతలు వచ్చారని పేర్కొంటున్నారు. ఇప్పుడు. కాంగ్రెస్లో చేరుతున్నవారందరికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా అవకాశాలు, కీలక పదవులు దక్కుతాయని హామీ ఇస్తున్నారు.